రెడ్ క్రాస్ సొసైటీ జీవితకాల సభ్యత్వ నమోదు చేపట్టిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్.
..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 5 (అఖండ భూమి న్యూస్);
శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తన ఛాంబర్‌లో భారత రెడ్ క్రాస్ సొసైటీ జీవితకాల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వం పొందారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ చేపడుతున్న మానవతా సేవా కార్యక్రమాలను అభినందించారు.
రెడ్ క్రాస్ సొసైటీ ప్రకృతి విపత్తులు, అత్యవసర పరిస్థితులు, రక్తదాన శిబిరాలు, ఆరోగ్య సేవలు , ఇతర సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు విశేష సేవలు అందిస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు.
సమాజ సేవ పట్ల ఆసక్తి ఉన్న అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు , ప్రజలు జీవితకాల సభ్యత్వం పొందాలని ఆయన పిలుపునిచ్చారు.
జీవితకాల సభ్యత్వం పొందదలచిన వారు తమ సభ్యత్వ దరఖాస్తు ఫారాలను పూర్తి చేసి సంబంధిత అధికారులకు 2026 జూన్ 15వ తేదీలోగా సమర్పించాలని సూచించారు. ఎక్కువ మంది సభ్యుల భాగస్వామ్యంతో రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించవచ్చని తెలిపారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


