*ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక గోవా బీచా వైజాగ్ బీచ్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్5 (అఖండ భూమి న్యూస్);
ఏపీలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోవా తరహా బీచ్ షాక్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ పాలసీ కింద విశాఖపట్నం, చీరాల బీచ్లలో తాత్కాలిక బీచ్ ఫ్రంట్ బార్లు, రెస్టారెంట్లు ఏర్పాటు చేయనున్నారు.
పర్యాటకులకు మద్యం, సీఫుడ్, స్నాక్స్ తదితర ఆహార పదార్థాలు అందుబాటులో ఉండనున్నాయి.
ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వీటి నిర్వహణకు అనుమతి ఇవ్వనున్నారు.
దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించి రాష్ట్రంలో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేయడమే ఈ నిర్ణయం లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


