ఎన్నికల నిర్వహణకు బూత్ స్థాయి నిర్వహణ అత్యంత తిలకం…

ఎన్నికల నిర్వహణకు బూత్ స్థాయి నిర్వహణ అత్యంత తిలకం…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 7 (అఖండ భూమి న్యూస్);

కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి బూత్ లెవెల్ శిక్షణ, సమీక్షా సమావేశం ఆదివారం ఘనంగా నిర్వహించారు.

కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గ స్థాయి బూత్ లెవెల్ ఏజెంట్లు (బి ఎల్ ఏలు) పార్టీ కార్యకర్తల కోసం ప్రత్యేక శిక్షణ, సమీక్షా సమావేశం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ షెట్కర్, టీపీసీసీ అధికార ప్రతినిధి, బీఎల్ఏ మాస్టర్ ట్రైనర్ మేనేని రోహిత్ రావు డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, ముఖ్య అతిథులుగా హాజరై కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ.

బీఎల్ఏలే పార్టీకి బలమైన పునాది అని అన్నారు.

ఓటర్ జాబితాలో సవరణలు చేయడానికి కానీ ఓటర్ లిస్టులో కొత్తవారిని చేర్చడానికి ( బి ఎల్ ఏ) ఉన్న అధికారం, ముఖ్యమంత్రి కూడా లేదని గుర్తు చేశారు.

బీఎల్ఏ ప్రాధాన్యత

బూత్ లెవెల్ ఏజెంట్ (బి ఎల్ ఎ) అనేది పార్టీకి కళ్లూ, చెవులూ వంటిదని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బూత్ స్థాయి వ్యవస్థ అత్యంత కీలకమని అన్నారు.

ప్రతి బీఎల్ఏ తన పరిధిలోని ఓటర్ల వివరాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఓటరు జాబితాలో తప్పులు, లోపాలు ఉంటే వెంటనే గుర్తించి సరిచేసే బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.

బూత్ స్థాయిలో పార్టీ కార్యకలాపాలు బలోపేతం కావాలంటే బీఎల్ఏలు నిరంతరం ప్రజలతో మమేకమై ఉండాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు.

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి బూత్ స్థాయి నిర్మాణమే ప్రధాన ఆయుధమని పేర్కొన్నారు.

జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ షెట్కర్ మాట్లాడుతూ.

ఓటరు జాబితాపై అప్రమత్తత అవసరం.

ఎన్నికల విజయానికి బూత్ స్థాయి నిర్వహణ అత్యంత కీలకమని అన్నారు.

ఓటరు జాబితాలో కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు, చిరునామా మార్పులు వంటి అంశాలపై బీఎల్ఏలు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

పార్టీ సిద్ధాంతాలను గ్రామాలు, కాలనీలు, వార్డుల స్థాయికి తీసుకెళ్లడంలో బీఎల్ఏల పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీలను మరింత బలోపేతం చేసి ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండాలని పిలుపునిచ్చారు

టీపీసీసీ స్పోక్ పర్సన్, బీఎల్ఏ మాస్టర్ ట్రైనర్ మేనేని రోహిత్ రావు మాట్లాడుతూ.

బీఎల్ఏ బాధ్యతలు, విధులపై సమగ్ర శిక్షణ ఇవ్వడం, రాజ్యాంగాన్ని కాపాడటానికి.

బీఎల్ఏల విధులు, బాధ్యతలు, ఎన్నికల సంఘం నిబంధనలు, ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, డిజిటల్ విధానాల వినియోగం తదితర అంశాలపై సమగ్ర శిక్షణ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇస్తున్నాం అని అన్నారు.

ప్రతి బీఎల్ఏ తన బూత్ పరిధిలోని ప్రతి కుటుంబంతో సంబంధాలు కొనసాగించాలని, కొత్త ఓటర్లను గుర్తించి నమోదు చేయించడంతో పాటు అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా ఏడాది పొడవునా ప్రజలతో అనుబంధాన్ని కొనసాగించే బాధ్యత బీఎల్ఏలపై ఉంటుందని వివరించారు.

ఓటరు జాబితా పరిరక్షణ, ఓటర్లతో నిరంతర సంబంధాలు, పార్టీ కార్యక్రమాల ప్రచారం, ప్రజా సమస్యల గుర్తింపు, ఎన్నికల సమయంలో సమర్థవంతమైన నిర్వహణ వంటి అంశాల్లో బీఎల్ఏలు కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు.

ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ , మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ , జిల్లా గ్రంధాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి , పట్టణ అధ్యక్షులు సందీప్, కౌన్సిలర్లు అంజాద్, లడ్డు, అఖిల, ఫెరోజ్ సుల్తానా, కళ్లెం సావిత్రి, యూనుస్, సీనియర్ నాయకులు ఇప్ప శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గొనె శ్రీనివాస్, సుదర్శన్, మండల అధ్యక్షులు కృష్ణ రావు, నరేందర్ రెడ్డి, రాజగౌడ్, నౌసిలాల్, శ్రీనివాస్, రమేష్ గౌడ్, మాజీ మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి, గూడెం శ్రీనివాస్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పుట్నాల శ్రీనివాస్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బాలరాజు, ఎస్ టి సెల్ జిల్లా అధ్యక్షులు రెడ్డి నాయక్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్, సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు కన్నయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు, బూత్ స్థాయి ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!