ప్రజావాణిలో 65 దరఖాస్తులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 8 (అఖండ భూమి న్యూస్);
ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రజల నుండి వినతులు స్వీకరించారు.
జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలు, ఫిర్యాదులు, అభ్యర్థనలకు సంబంధించిన దరఖాస్తులను కలెక్టర్‌కు సమర్పించారు. ఈ సందర్భంగా మొత్తం 65 దరఖాస్తులు వచ్చాయని,
అర్జీదారులు సమర్పించిన వినతులను జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తూ, వాటిని పరిశీలించి నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ప్రజావాణి లో అదనపు కలెక్టర్ ఎన్ వి గిరి, డి ఆర్ ఓ పాండు, జడ్పీ సీఈవో చందర్, జిల్లా అధికారులు, తదితరులు ఉన్నారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


