టిఎన్ఎస్ఎఫ్,టీజేఎస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేత…
*పెండింగ్ ఫీజు బకాయిలు రాకపోవడంతో విద్యార్థులకు, యాజమాన్యాలకు తప్పని ఇబ్బందులు..
*కోర్సులు పూర్తి అయిన సర్టిఫికెట్లు పొందలేక పోతున్న విద్యార్థులు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 8 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయాలను విడుదల చేయాలని కోరుతూ తెలుగునాడు విద్యార్థి సమైక్య (టిఎన్ఎస్ఎఫ్), తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు డాక్టర్ బాలు, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు కుంభాల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఫీజు బకాయిలు రాకపోవడంతో వివిధ కోర్సులు పూర్తి అయినప్పటికీ కళాశాలల నుండి వారి యొక్క సర్టిఫికెట్లను పొందలేకపోతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఎన్నో సందర్భాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫీజు బకాయిలను విడుదల చేస్తానని తెలియజేయడం జరిగిందని, స్వయంగా నాడు విద్యార్థి సంఘాలు నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగిందని ఈ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దాటిన గత టిఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ లో ఉంచిన బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు తీవ్రమైన ఇబ్బందులను ఎదురుకుంటున్నారని వెంటనే ప్రభుత్వం పెండింగ్ ఫీజు బకాయాలను విడుదల చేసి న్యాయం చేయాలని అన్నారు.


