వార్డు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా…

వార్డు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా…

12వ వార్డు కౌన్సిలర్ కాసర్ల గోదావరి స్వామి ..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 08 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు లో సోమవారం ఉదయ 8 గంటలకు మున్నూరు కాపు సంఘంలో 12వ వార్డు సభ నిర్వహించడం జరిగింది.

ఈ సభలో ముఖ్యఅతిథిగా మున్సిపల్ వైస్ చైర్మన్ 12వ వార్డు కౌన్సిలర్ కాసర్ల గోదావరి స్వామి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. తడి చెత్త ,పొడి చెత్త వేరు చేయడం, ఇంకుడు గుంత, డ్రైనేజీ, పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ, ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల స్వీకరణ,వార్డు సమస్యలపై చర్చించడం జరిగిందని ఈ సమస్యలపై పరిష్కారానికి 12 వ వార్డు కౌన్సిలర్ గా తనవంతు కృషి చేస్తానని కాసర్ల గోదావరి అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శ్రీమతి కాసర్ల గోదావరి స్వామి , మున్సిపల్ కమిషనర్ పర్వతాలు వార్డు సూపర్వైజర్ లలిత వార్డ్ ఆఫీసర్ వినయ్ కుమార్ మాజీ కౌన్సిలర్ పోలీస్ కృష్ణాజి రావు, ఆశా వర్కర్లు డ్వాక్రా సంఘం లీడర్లు మున్సిపల్ సిబ్బంది వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!