అడ్మిషన్ పొందిన విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్…

అడ్మిషన్ పొందిన విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 9 (అఖండ భూమి న్యూస్);

జిల్లాలో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడం, ప్రతి చిన్నారికి విద్యను అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా నిర్వహిస్తున్న బడి బాట కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు.

మంగళవారం రామారెడ్డి మండలంలోని SC కాలనీ లో నిర్వహించిన బడి బాట కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి, ఇంటింటి ప్రచారం (డోర్-టు-డోర్ కాంపనింగ్ కాంపనింగ్) ద్వారా పాఠశాల వయస్సు కలిగిన పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే కార్యక్రమాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసిన చిన్నారులకు ప్రీ-ప్రైమరీ తరగతుల్లో, అలాగే ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో అడ్మిషన్లు నమోదు చేయడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్న విద్యార్థులను కూడా గుర్తించి నమోదు చేపట్టడం జరిగిందని అన్నారు.

అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో జిల్లా కలెక్టర్ సమావేశమై ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు.

పాఠశాల వయస్సు కలిగిన ప్రతి చిన్నారి తప్పనిసరిగా పాఠశాలలో చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అలాగే డ్రాప్‌అవుట్ విద్యార్థులను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు.

ఈ సందర్భంగా అడ్మిషన్ పొందిన విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులను పంపిణీ చేశారు. విద్యార్థులు తమ జీవిత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.

విద్యే సమాజాభివృద్ధికి పునాదిగా

నిలుస్తుందని పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజన పథకం, త్వరలో ప్రారంభం కానున్న అల్పాహార పథకం, డిజిటల్ విద్యా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపించి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!