కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు నిందితుల అరెస్ట్!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 09. (అఖండ భూమి న్యూస్) ;
కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ , ఎక్సైజ్ అధికారి బి. హన్మంతరావు ఆదేశాల మేరకు, మంగళవారం కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు రైల్వే స్టేషన్‌లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. సంబల్పూర్ నుండి నాందేడ్ వెళ్లే ‘నాగవలి ఎక్స్‌ప్రెస్’ (ట్రైన్ నంబర్: 20809) లో తనిఖీలు చేస్తుండగా.. ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు పట్టుబడ్డారు.
వారిని తనిఖీ చేయగా వారి వద్ద నుండి 10 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది.
నిందితులు మహారాష్ట్రలోని జాల్నా జిల్లాకు చెందిన సునీల్ , ప్రవీణ్.
రవాణా మార్గం: నిందితులు ఒడిశాలోని రాయగడలో ఈ ఎండు గంజాయిని కొనుగోలు చేసి, మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుబడినట్లు కామారెడ్డి ఎక్సైజ్ సీఐ సిహెచ్. సంపత్ కృష్ణ తెలిపారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విజయవంతమైన తనిఖీలలో ఎక్సైజ్ సీఐ సిహెచ్. సంపత్ కృష్ణ, ఎస్ఐ ఎం. విక్రమ్ కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు జాన్, బలవంతరావు, ఫరూఖ్ మరియు సిబ్బంది రాజు, పవన్ రెడ్డి, బాబు, శరత్, వందన తదితరులు పాల్గొన్నారు.


