ప్రాంగణ నియామకాల్లో 23 మంది సోషల్ వర్క్ విద్యార్థుల ఎంపిక …
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 27 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణం సోషల్ వర్క్ విభాగము జై జై డబ్ల్యు ఈ ఎస్, ఇంపాక్ట్ సర్వీసెస్ ఎన్జీవో సంస్థల సహకారంతో సోషల్ వర్క్ విద్యార్థులకు ప్రాంగణ నియామకాలు నిర్వహించారు. తెలంగాణలోని వివిధ జిల్లాల్లోని కమ్యూనిటీ అభివృద్ధి ప్రాజెక్టులు అయినా 1. స్కూల్ ప్రోగ్రాం, 2. ఒకేషనల్ ట్రైనింగ్, 3. ఫుడ్ సేఫ్టీ లాంటి ప్రాజెక్టులలో జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ లుగా పనిచేయడానికి 23 మంది విద్యార్థులను ఎంపిక చేశారు.
ఎంపికైన విద్యార్థులను సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ గౌడ్, సోషల్ వర్క్ విభాగాధిపతి డాక్టర్ అంజయ్య బందెల లు అభినందించారు.
ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ ఉద్యోగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డా.యాలాద్రి డా.నర్సయ్య డా.రమాదేవి ఎన్జీవో సంస్థల ప్రతినిధులు రవికుమార్, కృష్ణ , సలావుద్దీన్, వెంకటలక్ష్మి, బాలచందర్, సౌత్ క్యాంపస్ మరియు కామారెడ్డి డిగ్రీ కాలేజ్ సోషల్ వర్క్ విద్యార్థులు పాల్గొన్నారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


