మందకృష్ణ మాదిగ నాయకత్వంలో నూతన శక్తులతో ఎమ్మార్పీఎస్ ను బలోపేతం చేద్దాం…

*మందకృష్ణ మాదిగ నాయకత్వంలో నూతన శక్తులతో ఎమ్మార్పీఎస్ ను బలోపేతం చేద్దాం…

*కామారెడ్డి జిల్లా ఇంఛార్జి* మంథని సామ్యెల్ మాదిగ..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 27 (అఖండ భూమి న్యూస్);

*32 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమం, వర్గీకరణ సాధన,అనేక సామాజిక అంశాలపై పోరాటం అనంతరం నూతన శక్తులతో ఉద్యమాన్ని బలోపేతం చేద్దామని ఉద్యమ శ్రేణులకు పిలుపునిస్తున్నాం*. అని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జ్ సామెల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

*ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఏర్పడ్డ ఎమ్మార్పీఎస్ మాదిగల ఉద్యమం చేస్తూనే మానవతా ఉద్యమం గా మారిందని, అనేక సామాజిక అంశాలపై ఉద్యమాలు చేసి విజయాలు సాధించిందని గుర్తు చేస్తున్నాం గుర్తు చేశారు.

*ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, గుండె జబ్బు పిల్లల ఉద్యమం ద్వారా ‘ఆరోగ్య శ్రీ ‘సాధన, వికలాంగుల మరియు వృద్దులు వితంతువుల పెన్షన్ పెంపు,ఉద్యోగుల ప్రమోషన్లో రిజర్వేషన్ సాధన రేషన్ బియ్యం పెంపు లాంటివి మచ్చు కు కొన్ని మాత్రమే*…

*సామాజిక బాధ్యత గా మరిన్ని పోరాటాలు చేసి విజయాలు సాధించడానికి యువతరం, నూతన శక్తులతో బలోపేతం చేయాలని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎమ్మార్పీఎస్ ఉద్యమ పునః నిర్మాణం జరుగుతుందని తెలియ చేస్తున్నాం. అన్నారు.

*అన్ని మండలాల్లో, జిల్లా స్థాయిలో కమిటీ ల నూతన నిర్మాణాలలో నవతరం, విద్యావంతులైన యువత ముందుకు రావాలని పిలుపునిస్తున్నాం అన్నారు.

*ఈరోజు కామారెడ్డి జిల్లా బిచ్కుంద మార్కెట్ యార్డు లో జరిగిన ఎమ్మార్పీఎస్ జిల్లా అత్యవసర సమావేశం లో జిల్లా ఇంఛార్జి మంథని సామ్యెల్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఈసమావేశంలో సీనియర్ నాయకులు కంతి పద్మారావు మాదిగ, పెద్దబూరి గంగారాం మాదిగ, మావురం శ్రీకాంత్ మాదిగ ,గోనె సురేష్ మాదిగ ,,మేత్రి హానుమాండ్లు ,,,గుడ్ల లక్మణ్, బొడికె హనుమాండ్లు,దర్శన్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!