కామారెడ్డి లో 46, 47 వార్డుల సభలు విజయవంతం…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 9 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 46, 47 వార్డులలో కౌన్సిలర్లు దంపతులు .గేరిగంటి స్వప్న, లక్ష్మీనారాయణలు రెండు వార్డులలో సభలను మంగళవారం విజయవంతంగా నిర్వహించారు. రెండు వార్డులలో సమస్యలను సత్వరం పరిష్కరించే విధంగా అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కొత్తగా సమస్యలు ఉన్న వాటిని తీర్చడానికి వార్డు ప్రజలు సహకరించాలని వినతులను స్వీకరించారు. ఈ రెండు వార్డులను భూగర్భ జలాలు నీటిని పెంచడానికి ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఇంటి పరిసరాలలో పరిశుభ్రతను, స్వచ్ఛతను పాటించాలని తెలిపారు. సార్ తప్పనిసరిగా తన ఓటు వివరాలను 2012 ఓటర్ జాబితాలో అనుసంధానం చేసుకోవాల్సిందిగా కోరారు. వార్డులో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధికి తోడ్పాటు అందించడమే ధ్యేయంగా పనిచేస్తానని కౌన్సిలర్లు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు ఆర్ఓ గోపాల్ రెడ్డి, మున్సిపల్ ఏఈ వేణు ప్రసాద్, పోలీస్ ఎస్ఐ విజయసాగర్, ఏఎస్ఐ రాజేంద్రప్రసాద్, వార్డు అధికారులు కిషోర్, రోహిదాస్, అంగన్వాడీ టీచర్ మంజుల ,బిఎల్ఓ లు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.


