టీపీసీసీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సార్) పై అవగాహన – శిక్షణ శిబిరం…

టీపీసీసీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సార్) పై అవగాహన – శిక్షణ శిబిరం…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 13 (అఖండ భూమి న్యూస్);

బిచ్కుంద మండల కేంద్రంలో టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంపై బూత్ లెవల్ ఏజెంట్లు (బి ఎల్ ఏ) కోసం ఏర్పాటు చేసిన అవగాహన శిక్షణ శిబిరంలో జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు ఈపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా బి ఎల్ ఏ లు కృషి చేయాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ఓటర్ల జాబితా కీలకమని పేర్కొన్నారు.

అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు, డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ గారు,నవీన్ పెట్టాం గారు, ఏఎంసీ చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు,సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, బి ఎల్ ఎ ల ఏజెంట్స్ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!