సంగమేశ్వర్ లో సెన్సార్ లు ఏర్పాటు ప్రారంభించిన సర్పంచ్ లోయపల్లి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 13 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో స్థానిక సర్పంచ్ లోయపల్లి శ్రీనివాసరావు ఆలోచన విధానంతో గ్రామం మొత్తం బదులుగా సెన్సార్ ను ఏర్పాటు చేసి శనివారం ప్రారంభించారు. ఈ సెన్సార్ ఏర్పాటు చేయడం వలన గ్రామంలోని వీధిలైట్లు అమార్చిన విద్యుత్ దీపాలు సాయంత్రం వేళ ఆటోమేటిక్ గా వీధి దీపాలు వెలుగుతాయని, అదేవిధంగా ఉదయం పూట ఆటోమేటిక్ గా ఆగిపోతాయని తెలిపారు. దీనివల్ల విద్యుత్ ఆదా అవడమే కాకుండా ఎలాంటి ఎలక్ట్రీషియన్, వర్కర్స్ లేకుండానే పని భారం తగ్గుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నీల స్వామి, పాలకవర్గం సభ్యులు, పంచాయతీ కార్యదర్శి సంజీవరెడ్డి గ్రామపంచాయతీ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.


