అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందజేత…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 13 (అఖండ భూమి వ్యూస్);
పోలీస్ అంటేనే ధైర్యం. ఏ ఆపదొచ్చిన మొదటగా గుర్తుచేది పోలీసులే. ఆ పోలీసులకు మానవత్వం తోడైతే.. ఏ పేదవాడికి కన్నీరు ఉండవు అని చెప్పేందుకు జుక్కల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే శ్రీనివాస్ నాయక్ నిదర్శనం. మాచారెడ్డి మండలంఎల్లంపేట పక్క గ్రామం పందిమడుగు తాండకు చెందిన భూక్యా శ్రీను మరణించారు. నిరుపేద కుటుంబం కావడంతో అంత్యక్రియలు నిర్వహించిన పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న ఎల్లంపేట గ్రామానికి చెందిన కానిస్టేబుల్ శ్రీను నాయక్ అంత్యక్రియలకు రూ. 5వేల ఆర్థిక సాయం అందించి.. ఆ కుటుంబానికి కొండంత మనోధైర్యాన్ని ఇచ్చారు. మృతి చెందిన శ్రీను భార్య జున్ను, ఇద్దరు కుమారులైన మహేందర్, వీరేందర్ లకు నేనున్నా అంటూ భరోసా ఇచ్చారు. ఆర్థిక సాయం చేసిన కానిస్టేబుల్ శ్రీను నాయక్ ను నాయకులు అభినందించారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


