హ్యూమన్ రైట్స్ జిల్లా చైర్మన్గా ఎన్నికైన 
దేవోల్లా రాములును సన్మానించిన మాజీ జెడ్పిటిసి…
కామారెడ్డి జిల్లా న్యూస్:జూన్ 14 (అఖండ భూమి న్యూస్);
హ్యూమన్ రైట్స్ యాంటీ కార్పొరేషన్ అసోసియేషన్!కామారెడ్డి జిల్లా చైర్మన్గా పాల్వంచ మండలం ఫరీద్ పేట్ కు చెందిన దేవోల్లా రాములు ఎన్నిక కావడంతో దోమకొండలో ఆదివారం మాజీ జెడ్పిటిసి సభ్యుడు తీగల తిరుమల గౌడ్ సన్మానించారు. ఈ రైట్స్ యాంటీ కార్పొరేషన్ అసోసియేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయనకు శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగాదేవోల్లా రాములు మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణకు తనవంతు కృషి చేస్తానన్నారు.మానవ హక్కులు (హ్యూమన్ రైట్స్) అంటే మనిషిగా జన్మించిన ప్రతి ఒక్కరికీ, ఎలాంటి వివక్ష లేకుండా (కుల, మత, వర్గ, లింగ భేదాలు లేకుండా) సంక్రమించే ప్రాథమిక హక్కులు , స్వేచ్ఛ. ఇవి ప్రతి మనిషి గౌరవంగా జీవించడానికి అవసరమైన న్యాయం , సమానత్వాన్ని అందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీతారాం మధు ముదిరాజ్, కదిరే గోపాల్ రెడ్డి, నేతుల సుధాకర్ యాదవ్ లు పాల్గొన్నారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


