ఎకరాకు మూడు బస్తాల
యూరియా ఇవ్వాలి…
మండలానికి బాయిల్డు రైస్ మిల్ మంజూరు చేయాలి..
మాజీ జెడ్పిటిసి సూచనకు సానుకూలంగా స్పందించిన మంత్రి తుమ్మల..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 16 (అఖండ భూమి న్యూస్);
ఈ వర్షాకాలం సీజన్లో ప్రతి రైతుకు ఎకరాకు మూడు బస్తాల ఏరియా ఇవ్వాలని ప్రభుత్వం రెండు బస్తాలు ఇస్తుందని రైతులతో వర్చువల్ సమావేశంలో దోమకొండ మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. మంగళవారం దోమకొండ రైతు వేదికలో రైతులతో వర్చువల్ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇతర ఉన్నతాధికారులు, కామారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి యూరియా బస్తాల పెంపు పంపిణీ సూచనపై మంత్రి తుమ్మల సానుకూలంగా స్పందించారు. ప్రతి మండలానికి ఒక సొసైటీకి బాయిల్డు రైస్ మిల్ మంజూరు చేయాలని ఆ రైస్ మిల్ ద్వారా వచ్చే లాభాలు మండల రైతులందరికీ అందుతాయని రైతులు ఆర్థికంగా లాభపడతారని మాజీ జెడ్పిటిసి వర్చువల్ సమావేశంలో విలువైన సలహా ఇచ్చారు. మాజీ జెడ్పిటిసి సలహాకు మంత్రి సానుకూలంగా స్పందించారు. దోమకొండ మండలంలో 11200 ఎకరాలలో వరి ధాన్యం పండుతుందని,7560 మంది రైతులు ఉన్నారని మాజీ జెడ్పిటిసి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
కామారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ వర్షాకాలంలో ఎల్ నినో ప్రభావంతో తక్కువ వర్షాలు ఉంటాయని రైతులు ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలని సూచించారు. కామారెడ్డి డివిజనల్ వ్యవసాయ అధికారిని అపర్ణ మాట్లాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయం బయో ఇన్పుట్ ఉత్పత్తిపై అవగాహన కల్పించారు. దోమకొండ సొసైటీ చైర్మన్ నాగరాజు రెడ్డి, సొసైటీ సీఈఓ బాల్రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ గోపాల్ రెడ్డిఅసిస్టెంట్ వ్యవసాయ అధికారి విస్తీర్ణ అధికారి కృష్ణారెడ్డి, పున్న లక్ష్మణ్ శంకర్ రెడ్డి,మల్లేష్ యాదవ్,రైతులు వ్యవసాయ సొసైటీ డైరెక్టర్లు మార్కెట్ కమిటీ ప్రతినిధులు రైతులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
కాచిగూడ ఎక్స్ప్రెస్లో దుండగుల హల్చల్: సిగ్నల్ ట్యాంపర్ చేసి ప్రయాణికులపై దాడి,..
కాలం గడపడమే ఘనతా?
మొబైల్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకొని యూరియా పొందాలి…
చిన్నారులకు అక్షరాభ్యాసం చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్…
మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా అన్న ప్రసాద వితరణ…


