కాంగ్రెస్ పార్టీ భవననానికి భూమి కేటాయింపు హర్షణీయం

కాంగ్రెస్ పార్టీ భవననానికి భూమి కేటాయింపు హర్షణీయం

జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యకులు నాగరాజ్ గౌడ్

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 17 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ భవనానికి జిల్లా కేంద్రంలో భూమి కేటాయించడం పట్ల జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు శాశ్వత చిరునామాగా ప్రజల సమస్యలను తీర్చే దిశగా జిల్లాలో భవన నిర్మాణానికి భూమి కేటాయింపుతో చారిత్రాత్మక అడుగు పడిందని ఆయన అన్నారు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం ఓక ఎకరం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు జిల్లాలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ,ఎమ్మెల్యేలు మదన్ మోహన్ రావు, లక్ష్మీకాంతరావులు సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి అవసరమయ్యే భూమి సాధించిన డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కృషి గర్వకారణమన్నారు

జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సొంత కార్యాలయం లేకపోవడంతో భవన నిర్మాణానికి భూమి కేటాయించిన ప్రజా ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వర్గానికి, టిపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లకు, డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ లకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!