బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆర్థిక సహాయం అందజేత…

బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆర్థిక సహాయం అందజేత…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 17 (అఖండ భూమి న్యూస్);

ఇటీవల బస్వాపూర్ గ్రామానికి చెందిన కాందూరి సాయిలుకి చెందిన 140 గొర్రెలు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనను గ్రామ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించారు.

గురువారం బస్వాపూర్ గ్రామాన్ని సందర్శించిన శ్రీ షబ్బీర్ అలీ బాధితుడు కాందూరి సాయిలు ని పరామర్శించి, రూ.50,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం కామారెడ్డి జిల్లా కలెక్టర్ తో ఫోన్‌లో మాట్లాడి, బాధిత రైతుకు తగిన నష్టపరిహారం ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే మిగిలిన గొర్రెలకు వెంటనే వైద్య సేవలు అందించాలని వెటర్నరీ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి , బస్వాపూర్ సర్పంచ్ తుడుం పద్మ , భిక్నూర్ సర్పంచ్ రేఖ , గుర్జకుంట సర్పంచ్ సంతోష్ రెడ్డి , భిక్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేందర్ రెడ్డి , సీనియర్ నాయకులు బాగారెడ్డి , సిద్దారములు , జీవన్ , ఎంఆర్ఓ, వెటర్నరీ వైద్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!