ఐకేపీ–డీఆర్డీఏ–ఎన్‌ఆర్‌ఈజీఎస్ సిబ్బందికి ఉచిత ఆరోగ్య శిబిరం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 24 (అఖండ భూమిని న్యూస్);
ఉద్యోగులు ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు.
జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం ఐకేపీ, డీఆర్డీఏ, ఎన్‌ఆర్‌ఈజీఎస్ సిబ్బందికి ప్రత్యేక ఉచిత ఆరోగ్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్
సాంగ్వాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎస్ ఇ ఆర్ పి & ఎస్ ఆర్ డి ఎస్ ఎలక్షన్ ఇన్సూరెన్స్ పి పి ఏ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. మొత్తం 263 మంది ఉద్యోగులు పాల్గొని వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. శిబిరంలో రక్తపోటు (బీపీ), రక్తంలో చక్కెర స్థాయిలు (షుగర్), ఈసీజీ, 2డీ ఎకో, కంటి పరీక్షలు తదితర వైద్య పరీక్షలను నిపుణులైన వైద్యులు నిర్వహించారు.
పరీక్షల అనంతరం అవసరమైన వారికి వైద్య సూచనలు, తదుపరి చికిత్సలపై సలహాలు అందించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, ప్రజాసేవలో నిరంతరం కృషి చేస్తున్న ఉద్యోగులకు ఆరోగ్య పరిరక్షణ అత్యంత అవసరమని అన్నారు. విధి నిర్వహణలో పని ఒత్తిడి, ప్రయాణాలు, క్షేత్రస్థాయి బాధ్యతల మధ్య ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యాలయ ప్రాంగణంలోనే వైద్య సేవలు అందించడం వల్ల ఉద్యోగులకు సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించే అవకాశం కలుగుతుందని తెలిపారు.
ఉద్యోగుల సంక్షేమం కోసం తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థ సీఈవో, రూరల్ డెవలప్‌మెంట్ కమిషనర్ దివ్య దేవరాజన్ చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు.
ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమం, సేవల సామర్థ్యం పరస్పరం అనుసంధానమై ఉన్నాయని, ఇలాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించడం ద్వారా ఆరోగ్యంపై అవగాహన పెరిగి పనితీరు మెరుగుపడుతుందని అన్నారు.
శిబిరాన్ని అదనపు కలెక్టర్ ఎన్.వి. గిరి, డీఆర్డీఓ దామోదర్ రెడ్డి, అదనపు డీఆర్డీఓ విజయలక్ష్మి సందర్శించి వైద్య సేవల అమలును పరిశీలించారు. కార్యక్రమ నిర్వహణలో ఎలక్షన్ కోఆర్డినేటర్ పవన్ కీలక పాత్ర పోషించారు.
ఆరోగ్య శిబిరంలో యశోద ఆసుపత్రి వైద్య బృందంతో పాటు నిజామాబాద్‌కు చెందిన మాక్స్ విజన్ కంటి ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొని సేవలందించారు. ఉద్యోగుల్లో ఆరోగ్యంపై చైతన్యం పెంపొందించడంతో పాటు, ముందస్తు ఆరోగ్య పరీక్షల ప్రాముఖ్యతను తెలియజేయడంలో ఈ శిబిరం ఉపయోగకరంగా నిలిచిందన్నారు.
జ
You may also like
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు డెస్కులు..పంపిణీ…
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హామీమ్మ్…
ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు…
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డిపై మూడు క్రిమినల్ కేసులు కొట్టివేత…
మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నూతన గృహప్రవేశానికి హాజరైన కౌన్సిలర్స్ గిరిగంటి దంపతులు…


