మట్టి దొంగలకు కళ్లెం వేసేది ఎవరు… ?

 

 

మట్టి దొంగలకు కళ్లెం వేసేది ఎవరు… ?

నిబంధనలు గాలిలో వదిలారు… ఇబ్బందుల్లో గ్రామాల ప్రజలు…

పట్టించుకోని సంబంధిత అధికారులు…

అంబేద్కర్ కోనసీమ మే 19 అఖండ భూమి వెబ్ న్యూస్ :  మట్టిదొంగల భరతం పట్టేది ఎవరని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి చీకురుమెల్లి రవికుమార్ అన్నారు. నిబంధనలను గాలికి వదిలారు అన్నారు. శుక్రవారం ఆయన అఖండ భూమి తో మాట్లాడుతూ సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ఆయా గ్రామాల ప్రజలు శబ్ద కాలుష్యంతో దుమ్ము దూళితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. డా.బి. ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, కాట్రేని కోన మండలం, పల్లంకుర్రు గ్రామ పంచాయితీ పరిధిలో గల , రామాలయం పేట,సమీపంలో ఆర్ అండ్ బి రోడ్డు కు ఆనుకుని ఉన్న వ్యవసాయ భూమిని ప్రైవేటు కాంట్రాక్టర్లు, అనధికారికంగా వ్యవసాయ భూమిని త్రవ్వి భారీ వాహనాలతో (టిప్పర్లు) సహాయంతో ఆ మట్టిని , బలుసుతిప్ప నుండి పల్లంకుర్రు వెళ్లు ఆర్&బి రోడ్డు మీదుగా భారీవాహనాలతో మట్టిని రవాణా చేస్తున్నారని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి: చీకురుమెల్లి రవికుమార్ . మీడియా ద్వారా రాష్ట్రప్రభిత్వానికి తెలియజేసారు.

 

ముఖ్యంగా..గ్రామాలలో నివసిస్తున్న ప్రజలు, వాహన శాబ్దాలకు భయబ్రాంతులకు గురౌతున్నారని, అలాగే ఇరుకు రోడ్డు కావడంతో రోడ్డుపై ప్రయాణించే ప్రజలకు చాలా ప్రమాద కరంగా ఉందని, ప్రజలకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వానికి మరోసారి తెలియజేసారు. మరో ముఖ్య విషయం ఈ భారీ వాహనాల వల్ల రోడ్లు పూర్తిగా చెడిపోయి గుంతలు పడిపోతున్నాయి ,మరియు త్రాగునీరు పైపు లైన్లు పగిలి పోయే అవకాశాలు ఉన్నాయి.ఈ పైపు లైన్లు పగిలితే నాలుగు అయిదు రోజులు త్రాగునీరు ప్రజలకు లభించదు. కనుక ఈ వాహనాలను ఈ రోడ్డుపై నుండి రవాణా నిషేదించాలని, ఏటిగట్టు పై నుండి రవాణా చేసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పిర్యాదు పై తక్షణమే చర్యలు తీసుకోవాలని సవినయంగా ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఈ పిర్యాదు ప్రజా సంక్షేమం కోసం, మరియు రోడ్లు భద్రత కోసమేనని,సవినయంగా మరోసారి తెలియ జేశారు .లేని పక్షంలో జన సమూహంతో రోడ్డుపై నిరాహారదీక్ష చేసి వాహనాలను అడ్డుకుంటామని ప్రభుత్వాన్ని మీడియా ద్వారా హెచ్చరించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!