ఉన్నతావకాశాలు అందుకునేలా పట్టుదలతో చదువుకోవాలి.
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ చహత్ బాజ్‌పాయ్
రెబ్బెన ప్రతినిధి మే 20 (అఖండ భూమి) :
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, వంకులంలో నిర్వహిస్తున్న జాయ్ ఫుల్ లెర్నింగ్ సెంటర్ (సమ్మర్ క్యాంపు) ను కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, అడిషనల్ కలెక్టర్ శ్రీమతి.చాహత్ బాజ్‌పాయ్ శనివారం రోజున ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ఉన్నతావకాశాలు అందుకునేలా పట్టుదలతో చదువుకోవాలన్నారు. విద్యార్థిని, విద్యార్థులు ఈ సమ్మర్ క్యాంప్‌లో నేర్చుకున్న అంశాలపై ప్రదర్శనను తిలకించారు. ఈ ప్రదర్శనలపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ విద్యార్థిని, విద్యార్థులు ఇంగ్లీష్ భాషలో స్పష్టంగా మాట్లాడటం ఆనందదాయకమన్నారు. వేసవి సెలవులలో సమయం వృధాచేసుకోకుండా ఆహ్లదకరంగా వివిధ అంశాలలో అభ్యసన చేస్తున్న విద్యార్థులను అభినందించారు. వివిధ అంశాలలో ఆహ్లదకరమైన అభ్యసనను ఈ కేంద్రం ద్వారా కల్పిస్తున్న ప్రధానోపాధ్యాయులు జాడి ప్రభాకర్, నిర్వహకుడు యం రాజకమలాకర్రెడ్డిలను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్, ఎం,సి, ఛైర్మన్ ఎవులె ప్రకాష్, వార్డు సభ్యులు జాదవ్ ప్రేమ్‌దాస్, విద్యార్థిని విద్యార్థులు పాల్గోన్నారు.