మహోన్నత వ్యక్తి ని అవమానించడం మహా పాపం – తట్టా శ్రీనివాసరావు

ఆంధ్ర ప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా నాతవరం మండలం గునుపూడి గ్రామంలో భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరలో ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటు చేయటం వల్ల మధ్యం సేవించి బీరు మధ్యం సీసాలను విగ్రహం వద్ద పడుస్తూ దళితుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని మాల మహానాడు అనకాపల్లి జిల్లా ఇంఛార్జి తట్టా శ్రీనివాసరావు అన్నారు అధికారులు ప్రపంచ మేధావి గా పేరొందిన మహోన్నత వ్యక్తి విగ్రహం ప్రక్కనే మధ్యం షాపు ఏర్పాటు చేసి ఆయనను అవమానించడం మహా పాపమని అన్నారు ప్రభుత్వ మద్యం దుకాణం పెట్టేటప్పుడు స్కూళ్లకు దేవాలయాలకు మహోన్నత వ్యక్తుల విగ్రహాలకు దూరంగా ఉండాలనే షరతులున్నా వాటిని అధికారులు పాటించకుండా ఈ విధంగా ఏర్పాటు చేయడం అగౌరవ పరచడమేనని ఆయన అన్నారు ఈ మధ్యం షాపు ఏర్పాటు పై నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల గణేష్ వైఖరి ఏంటో చెప్పాలని జయంతి రోజున పూల మాలలు వేసి తరువాత మధ్యం షాపు ఏర్పాటు చేసి బాబా సాహెబ్ అగౌరవ పరచడం తగదని హితవు పలికారు ప్రపంచ దేశాలలోని దేశాధి నేతలు ఆయన్ను గౌరవిస్తుంటే స్వదేశంలో ఆయనకు అవమానాలు జరగడం దారుణమని మిగతా నాయకులకు ఇచ్చే గౌరవం దళిత నాయకుడని ముద్ర వేసి బాబాసాహెబ్ కు ఇవ్వటం లేదని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గునుపూడి మద్యం దుకాణం ను అక్కడ నుంచి తక్షణమే వేరొక చోటికి మార్చాలని లేకపోతే మా దళిత సంఘాలతో ధర్నాకు దిగుతామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమం లో జిల్లా కో ఆర్డినేటర్ గోవింద్ ప్రకాష్ భరత్ కుమార్  తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!