స్వాతంత్ర్య సమరయోధుల సేవలు చిరస్మరణీయం డోన్ డిప్యూటి తహశీల్దార్ పి.మధు

 

 

స్వాతంత్ర్య సమరయోధుల సేవలు చిరస్మరణీయం

డోన్ డిప్యూటి తహశీల్దార్ పి.మధు

సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి

మే 20 న మన దేశ స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ బిపిన్ చంద్రపాల్ గారి వర్ధంతి సందర్బంగా మరియు స్వాతంత్ర్య సమరయోధులు ఆంధ్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్థంతి సందర్బంగా*

డోన్ పట్టణం లో ఎమ్మార్వో కార్యాలయం నందు

సామాజిక కార్యకర్త పి.మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో డిప్యూటీ తహశీల్దార్ పి. మధు అధ్యక్షతన మే 20 న మన దేశ స్వాతంత్ర్యసమరయోధులు శ్రీ బిపిన్ చంద్రపాల్ గారి వర్ధంతి సందర్బంగా మరియు స్వాతంత్ర్య సమర యోధులు ఆంధ్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతులను పురస్కరించుకొని వారి చిత్రపటాలకు పూలమాల వేసి ఘణంగా నివాళ్ళు అర్పించి వారిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బి. మధు సుధాకర్ డిప్యూటి తాసిల్దార్ రీసర్వే, జి. జాకీర్ హుస్సేన్ రెవెన్యూ ఇన్స్పెక్టర్, కే.వి. ఉపేంద్ర జూనియర్ సహయకులు, వీఆర్వోలు, అటెండర్ వలి ,ఎమ్మార్వో అఫిస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా డోన్ డిప్యూటీ తహశీల్దార్ పి. మధు,సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి మాట్లాడుతూ

మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని డిప్యూటీ తహశీల్దార్ పి. మధు, సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి కోరారు

Akhand Bhoomi News

error: Content is protected !!