ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలి…

ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 10 (అఖండ భూమి న్యూస్);
ప్రజాస్వామ్య పరిరక్షణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ అత్యంత కీలకమైనదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు.
శుక్రవారం జుమ్మా నమాజ్ చేసిన అనంతరం బిలాల్ మజీద్ లో ముస్లిం సోదరులను, ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.
ప్రతి అర్హత ఓటరు తప్పనిసరిగా ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పాల్గొని ఓటరు జాబితాలో తమ వివరాలను నమోదు చేసుకోవడం లేదా ధృవీకరించుకోవడం ద్వారా ఓటు హక్కును పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.
ఓటరు జాబితాను పూర్తిగా పారదర్శకంగా, తప్పులు లేకుండా రూపొందించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమానికి ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరమని, ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన విలువైన హక్కు అని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటరు జాబితాలో సక్రమంగా ఉందో లేదో వెంటనే పరిశీలించుకోవాలని, ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దించుకోవాలని సూచించారు.
కొత్తగా అర్హత పొందిన వారు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, అవసరమైన పత్రాలను సమర్పించి నమోదు, సవరణ, ధృవీకరణ ప్రక్రియను ఆలస్యం చేయకుండా పూర్తి చేసుకోవాలని కోరారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థలు, కార్యకర్తలందరి బాధ్యత అని షబ్బీర్ అలీ అన్నారు. గ్రామాలు, వార్డులు, కాలనీల స్థాయిలో ప్రచారం నిర్వహించి ఒక్క అర్హ ఓటరు కూడా నమోదు కాకుండా మిగిలిపోకుండా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఓటరు తన ఓటు హక్కును పరిరక్షించుకుంటూ ఎస్‌ఐఆర్ ప్రక్రియలో చురుకుగా పాల్గొని ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ అడిషనల్ కలెక్టర్ (ఆర్డీవో) డీవై గిరి, ఎమ్మార్వో హిమబిందు, మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమా శ్రీనివాస్, కామారెడ్డి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఐరేని సందీప్, మండల అధ్యక్షులు రాజగౌడ్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
You may also like
ఫరీద్ పేట్ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో సోషల్ ఆడిట్ నిర్వహణ చేసిన రీనా…
గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి , ప్రణాళిలు సమర్థవంతంగా అమలు చేయాలి.
13న టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల నిరసన
దోమకొండ ముదిరాజ్ అబ్రబోయిన పాండి అధ్యక్షులుగా అబ్రబోయిన రాజేందర్..
కాంట్రాక్టు బస్తీ బెల్లంపల్లి మున్సిపాలిటీ లో లేదా


