13న టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల నిరసన  

13న టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల నిరసన 

– నిరసన కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు తరలి రావాలి

– టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 10 (అఖండ భూమి న్యూస్);

జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 13న కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని టిడబ్ల్యూజేఎఫ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు పేర్కొన్నారు . శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. జర్నలిస్టులకు అందజేసిన హెల్త్ కార్డులు నిమ్స్ ఆస్పత్రి మినహా ఇతర కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేయడం లేదని, వెంటనే అందరికీ కొత్త హెల్త్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.

జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశంపై ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని, క్యాబినెట్ సబ్ కమిటీ తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను వెంటనే పంపిణీ చేయాలని, కార్డుల జాప్యం వల్ల బస్ పాస్‌లు తదితర సౌకర్యాలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. జర్నలిస్టులకు నెలకు రూ.10 వేల పెన్షన్ అందించాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు 100 శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం వెంటనే జీవో జారీ చేయాలని తదితర అంశాలపై ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యుఎఫ్ నాయకులు డాకూరి మోహన్, తెడ్డు సాయిలు, జూపల్లి తిరుపతి రెడ్డి, పగల సాయిబాబా, పట్నం నర్సిములు, మెత్తల అనిల్, కిసారి రాజు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!