గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి , ప్రణాళిలు సమర్థవంతంగా అమలు చేయాలి.
..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 10 (అఖండ భూమి న్యూస్);
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు కామారెడ్డి డివిసోన్ ,
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు.
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయడంలో భాగంగా జిల్లాలోని మూడు డివిజన్ కేంద్రాలలో సంబంధిత గ్రామ సర్పంచులు కార్యదర్శులకు శుక్రవారం శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. కామారెడ్డి మున్సిపల్ కళాభారతి ఆధ్వర్యంలో కామారెడ్డి డివిజన్ సంబంధించినటువంటి సర్పంచులు , పంచాయతీ శిక్షణ శిబిరానికి జిల్లా కలెక్టర్ హాజరై సర్పంచ్లను, కార్యదర్శిలను ఉద్దేశించి కింది విధంగా ప్రసంగించారు. సర్పంచ్‌లు , పంచాయతీ కార్యదర్శులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు.
అనంతరం కళాభారతి ఆడిటోరియం కామారెడ్డిలో
కలెక్టర్ మాట్లాడుతూ. గ్రామ సమగ్ర అభివృద్ధి ప్రణాలికను 2026-27,2027-28,2028-29 సంవత్సరాల కొరకు ప్రజలను మరియు పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి అధికారుల భాగస్వామ్యముతో తయారు చేయాలి
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించడం, నిధుల పారదర్శక వినియోగం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఈ శిక్షణలో వివరణాత్మకంగా అవగాహన కల్పించనున్నామని కలెక్టర్ తెలిపారు.
గ్రామ పంచాయతీయే గ్రామీణాభివృద్ధికి మూలం. సర్పంచ్‌లు, కార్యదర్శులు సమన్వయంతో పనిచేసి, ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనపై ఉందినీ అన్నారు. శిక్షణలో చెప్పే అంశాలను క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా అమలు చేయాలి” అని కలెక్టర్ సూచించారు.
వి బి జి ఐ ఆర్ ఏ ఎం జి పథకమును ఉపయోగించి పలు రకాల అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు.
16 వ ఆర్థిక సంఘం నిధులు వినియగం, ప్రణాళిక పారదర్శకంగా ఉండాలి అని తెలిపారు.
గ్రామపంచాయితీలు తమ స్వంత ఆదాయమును పెంచుకుని 16 వ ఆర్హిక సంఘము నుండి 10% పెర్ఫిర్మన్స్ గ్రాంటు పొందాలన్నారు.
మొదటి విడత ఇందిరమ్మ యిండ్లు లో రాష్ట్రం మొదటి 10 స్థానంలో నిలిచిందని మారుతూ రెండవ విడత HUT FREE జిల్లాగా మార్చుటకు సర్పంచులు సహకరించాలన్నారు.
బడిబాట లో రాష్ట్రం 4 స్థానంలో ఉందని మొదటి స్థానంలో తీసుకురావడానికి జిల్లాలోని సమస్త సర్పంచులు కురిచేసి ప్రభుత్వ పాఠశాలల్లో నవోదయ సంఖ్యను పెంచాలని సూచించారు.
ఈ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం, కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఏ సి ఎల్ బి, ఎన్ వై గిరి,డిప్యూటీ కలెక్టర్ రవితేజ, డిపిఓ మురళి, డి ఆర్ డి ఓ దామోదర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, డి ఎల్ పి ఓ శ్రీనివాస్, ,ఎంపీడీవోలు జిల్లా అధికారులు సర్పంచులు పంచాయతీ, సెక్రెటరీలు పాల్గొన్నారు.
You may also like
ఫరీద్ పేట్ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో సోషల్ ఆడిట్ నిర్వహణ చేసిన రీనా…
13న టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల నిరసన
ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలి…
దోమకొండ ముదిరాజ్ అబ్రబోయిన పాండి అధ్యక్షులుగా అబ్రబోయిన రాజేందర్..
కాంట్రాక్టు బస్తీ బెల్లంపల్లి మున్సిపాలిటీ లో లేదా


