రక్తదానంతో మానవత్వాన్ని చాటుతున్న శ్రీహరి…
*ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం..
*రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త,ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 16 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న శివలీల (55) కు ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో జిల్లా చెందిన శ్రీహరి మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగిందని రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త,ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న శ్రీహరి సేవలు అభినందనీయమని,తోటి మనిషి ప్రాణాలను కాపాడడం కోసం నిస్వార్ధంగా రక్తదానం చేస్తూ యువతకు ఆదర్శంగా నిలవడం జరిగిందని అన్నారు. ఆపదలో ఉన్న వారికి కావలసిన రక్తాన్ని అందజేయడం కోసం ఎల్లవేళలా కృషి చేస్తున్నామని,తల సేమియా బాధిత చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని ఆగస్టు నెలలో నిర్వహిస్తామని అన్నారు ప్రతి 15 రోజులకు ఒకసారి కావాల్సిన రక్తం చిన్నారులకు దొరకకపోవడంతో తీవ్ర ఇబ్బందుల్లో గురి అవుతున్నారని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 250 మంది వరకు చిన్నారులు ఈ వ్యాధితో బాధపడుతున్నారని వారి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి పైన ఉందని అన్నారు.రక్తదాతకు అభినందనలు తెలిపారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


