బాన్సువాడ డివిజన్‌లో శారీరక దివ్యాంగుల కోసం ప్రత్యేక యు డి ఐ డి (సదరం) క్యాంపు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 16 (అఖండ భూమి న్యూస్);
బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) సంయుక్తంగా 12-07-2026 (ఆదివారం) నాడు బాన్సువాడ డివిజన్‌కు చెందిన శారీరక దివ్యాంగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రత్యేక యు డి ఐ డి (సదరం) క్యాంపును ప్రారంభించారు.
జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా బాన్సువాడ డివిజన్ పరిధిలోని శారీరక దివ్యాంగులకు స్థానికంగానే యు డి ఐ డి (సదరం) సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేశారు.
ఈ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. ట్రయల్ రన్ సందర్భంగా దివ్యాంగుల నమోదు, వైద్య మూల్యాంకనం మరియు ఇతర ప్రక్రియలు సజావుగా నిర్వహించబడ్డాయి.
ఈ ప్రత్యేక యు డి ఐ డి (సదరం) క్యాంపులు ప్రతి నెలలో రెండుసార్లు బాన్సువాడ డివిజన్‌లో నిర్వహించబడనున్నాయి. దీని ద్వారా శారీరక దివ్యాంగులు తమ ప్రాంతంలోనే సులభంగా సేవలను పొందే అవకాశం కలుగుతుంది.
ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి కి, గౌరవనీయ జిల్లా కలెక్టర్ కి, గౌరవనీయ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్య బృందం మరియు సంబంధిత శాఖల అధికారులకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డిఆర్డిఏ), కామారెడ్డి జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
You may also like
కాకి వాగు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు శంకుస్థాపన…
రక్తదానంతో మానవత్వాన్ని చాటుతున్న శ్రీహరి…
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సమీక్ష…
కష్టాల్లో ఉన్న కుటుంబానికి పెద్దన్నలా అండగా నిలిచిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్…
ఐఐఐటికీ ఎంపికైన విద్యార్థినికి ఆర్థిక సహాయం అందజేత…


