గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరంలో దారుణం జరిగింది. సగం కాలిన స్థితిలో ఉన్న రెండు మృతదేహాలు కలకలం రేపాయి. గన్నవరం మండలం సావరగూడెం సమీపంలోని బుడమేరు కాలువ వద్ద ఉన్న మామిడితోటలో సగం కాలిన స్థితిలో ఉన్న ఇద్దరి మృతదేహాలను ఆదివారం స్థానిక రైతులు గుర్తించారు..
వెంటనే పోలీసులు, అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరిస్తున్నారు.
రెండు మృతదేహాల్లో ఒకరిది స్థానికంగా తిరుగాడే యాచకుడిదిగా గుర్తించినట్టు సీఐ కనకారావు తెలిపారు. మామిడితోట యజమాని ఇతర ప్రాంతంలో ఉండటంతో అక్కడికి వచ్చిన యాచకుడు.. సుమారు వారం రోజుల క్రితం మృతి చెంది ఉంటారని వెల్లడించారు. ఎండ తీవ్రత కారణంగా మృతదేహం కాలినట్లు మారిందన్నారు. మరో మృతదేహం సుమారు 35 ఏళ్ల వయసున్న వ్యక్తిదిగా గుర్తించామన్నారు. చేతికి ఉన్న కడియం ఆధారంగా క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరిస్తున్నట్టు చెప్పారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



