
22న తొలేళ్ళమహోత్సవం, డాన్స్ బేబీ డాన్స్ ప్రదర్శన
23న అమ్మవారి అనుపుమహోత్సవం
24న ఎడ్ల పరుగు ప్రదర్శనలు
అఖండ భూమి (వేపాడ )మే 21:- మండలంలోని నల్లబిల్లి గ్రామదేవత శ్రీగడి మారమ్మతల్లి అమ్మవారి పండగ మహోత్సవాలు సోమ, మంగళ, బుధవారాలలో అత్యంత వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేసారు.సోమవారం నాడు ఉదయం 8గంటల నుంచి అమ్మవారికి డూపదీప నైవేద్యాలు, పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం అమ్మవారి తొలేళ్ళ ఉత్సవం వేడుకగా నిర్వహిస్తారు.అదే రోజు రాత్రి 10గంటల నుంచి డాన్స్ బేబీ డాన్స్ నృత్యప్రదర్శన జనరంజకంగా జరుగుతుంది. అలాగే మంగళవారం నాడు అమ్మవారి అనుపుమహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.అలాగే బండ్ల వేషాలు, తీన్మార్ వాయిద్యాలు,రాత్రి 7గంటల నుంచి డాన్స్ బేబీ డాన్స్ నృత్యప్రదర్శనలు, రాత్రి 10గంటల నుంచి గయోపాఖ్యానం,సత్యహరిచ్చంద్ర తదితర పౌరాణిక నాటక ప్రదర్శనలు కడురమ్యంగా ప్రదర్శించనున్నారు.అలాగే బుధవారం నాడు మధ్యాహ్నం 12గంటల నుండి ఆలయ ఉత్సవకమిటి ఆధ్వర్యంలో ఎడ్ల పరుగు ప్రదర్శన జరుగుతుంది.ఈ ఎడ్ల పరుగు ప్రదర్శనలో విజేతలకు రూ 20వేల నుంచి వెయ్యి రూపాయల వరకు నగదు బహుమతులను అందజేస్తారు.
You may also like
అట్రాసిటీ కేసులలో దళితులకు అన్యాయం జరిగితే సహించబోము .. మాల మహానాడు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు టి. శ్రీనివాసరావు
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


