అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవం 2023 స్పెషల్

 

 

అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవంను ప్రతి సంవత్సరం మే 22వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం ‘ఒప్పందం నుండి చర్యలు- జీవవైవిద్య పునర్నిర్మాణం’ ప్రధానాంశంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి జీవవైవిద్య సదస్సు పేర్కొంది. ఈ సంవత్సరం జీవవైవిద్య దినోత్సవం ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ప్రపంచ జీవవైవిద్య ఉత్సవాల్లో భాగంగా కున్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ప్రేమ్ వర్క్ ను ఐక్యరాజ్యసమితి జీవ వైవిధ్య సదస్సు 15వ పార్టీల సదస్సులో భాగంగా అమలు చేయుటకు నిర్ధారించింది. జీవవైవిద్యమనేది అనేక రకాలైన మొక్కలు జంతువులు మరియు సూక్ష్మజీవుల వైవిధ్యంగానే అర్థం చేసుకుంటున్నాం కానీ దీంతో పాటు ప్రతి జాతి జీవుల్లో ఉండే జన్యు వైవిధ్యాలు కూడా ఇందులో భాగమే. ఉదాహరణకు అనేక రకాలైన పంట మొక్కల్లో ఉండే వైవిధ్యాలు పశుసంపదలో ఉండే వైవిధ్యాలు మరియు వివిధ రకాలైన ఆవరణ వ్యవస్థలు (అడవులు, ఎడారులు, సేద్య భూములు) ఇవన్నీ మానవులతోనూ, మొక్కలతోనూ, జంతువులతోనూ నిరంతరం పరస్పర చర్యలు జరిగిస్తున్నాయి కానీ జీవవైవిద్యం కోల్పోతుండడంతో మన ఆరోగ్యంతో సహా అనేక రకాలుగా ఆపదలు సంభవిస్తున్నాయి. జీవవైవిద్యం కోల్పోవడం మూలంగా అనేక రకాలైన వ్యాధులు జంతువుల నుండి మానవులకు సోకుతున్నాయి మనం ఈ జీవవైవిద్యాన్ని సంరక్షిస్తే కరోనా వైరస్ వలే అనేక రకాల వ్యాధుల భౌగోళిక వ్యాప్తిని నియంత్రించవచ్చును. ప్రపంచవ్యాప్తంగా జీవవైవిద్య సదస్సులకు ఎంతో ప్రాముఖ్యం పెరిగింది. ఇది భవిష్య తరాలకు అందించే ముఖ్యమైన సంపద. మానవ కార్యకలాపాలు ద్వారా ఎన్నో జీవ జాతులు అంతరించిపోతున్నాయి. అందులో భాగంగా ప్రజా చైతన్య కార్యక్రమాలను ఏర్పాటు చేసి వైవిధ్య సంరక్షణకు తోడ్పడే విధముగా ప్రతి సంవత్సరం అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంను జరుపుకోవడం జరుగుతుంది. జీవ వైవిధ్య సంరక్షణ కొరకు 22 చర్యలు రూపొందించిన ఐక్యరాజ్యసమితి జీవవైవిద్య సదస్సు1. మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రం చేయడం.2. మీ దగ్గరలో ఉన్న అందుబాటులోనున్న ప్రాంత పునర్నిర్మాణానికి తోడ్పడడం.3. జీవజాతులను తొలగించకుండా వాటి చిత్రాలను మాత్రమే తీసుకోవడం.4. తేడా లేకుండా జంతు జాతులకు ఎంతోకొంత సహాయం అందించడం.5. జంతువుల నుండి మానవులకు సోకే వ్యాధులు వ్యాప్తిని నివారించడం.6. స్థానికంగా పెరిగే మొక్కలను, పొదలను, మరియు వృక్షాలను నాటడం.7. బాధ్యతతో వనరులను వినియోగించడం.8. విద్యుత్ శక్తిని సంరక్షించడం.9. జీవ వైవిధ్య సంరక్షణను ఇతరులతో పంచుకోవడం.10. జీవవైవిద్యానికి అనుకూలంగా ఉండే ఉత్పత్తులను మాత్రమే కొనడం.11. ధూమపాన నివారణకు సహాయం చేయడం.12. పట్టణ జీవవైవిద్య పార్కులను ఆస్వాదించడం.13. జీవవైవిద్య సంరక్షణకు నియమ, నిబంధనలను పాటించే సంస్థలకు చేయూతనందించడం.14. జీవ వైవిధ్యానికి ఆటంకం కలిగించే ఒక్క అలవాటు నైనా మార్చడం.15. జీవవైవిద్యం ఆధారంగా చేసే వాణిజ్యం బాధ్యతగా చేయమని అడగడం.16. వ్యర్ధాలను తగ్గించడం.17. జీవ రక్షణ గురించి తెలుసుకోవడం.18. జీవవైవిద్యానికి అనుకూలంగా పనిచేసే సంస్థలకు చేయూతను అందించడం.19. పర్యావరణ సంస్థలకు చేయూతనందించడం.20. జీవవైవిద్య చైతన్య కార్యక్రమాలను నిర్వహించడం.21. ఇతరుల ఉద్ధరణకు తోడ్పడడం.22. జీవవైవిద్య దినోత్సవం జరుపుకోవడం.

 

డాక్టర్ యర్రయ్య కొండ్రు

కేంద్రీయ విద్యాలయం అధ్యాపకులు

Akhand Bhoomi News

error: Content is protected !!