
TDP-Mahanadu: ఈసారి ‘మహానాడు’కు ఒక ప్రత్యేకత ఉంది: చంద్రబాబు
రాజమహేంద్రవరం: తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మహానాడు కార్యక్రమం రాజమహేంద్రవరంలో అట్టహాసంగా ప్రారంభమైంది..
తెలుగు రాష్ట్రాల్లోని పార్టీ కార్యకర్తలు, శ్రేణులు మహానాడుకు భారీగా హాజరయ్యారు. మహానాడులో భాగంగా తొలిరోజైన ఇవాళ ప్రతినిధుల సభ నిర్వహిస్తున్నారు. మరో 35 వేల మంది వరకూ కార్యకర్తలు వస్తారని అంచనా. కార్యక్రమానికి హాజరైన పార్టీ అధినేత చంద్రబాబు మొదటగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి మహానాడును ప్రారంభించి పార్టీ జెండాను ఆవిష్కరించారు..
చంద్రబాబు మాట్లాడుతూ.. ”ఈసారి మహానాడుకు ఒక ప్రత్యేకత ఉంది. ఎన్నో ‘మహానాడు’లను చూశాను. కానీ, ఇంతకుముందెప్పుడూ కనిపించని ఉత్సాహం ఇవాళ చూస్తున్నాను. ఎన్టీఆర్ శత జయంతిని ప్రపంచమంతా నిర్వహించుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా 100 ప్రదేశాల్లో ఏ నాయకుడికి జరగనంత గొప్పగా శతజయంతిని చేశాం. క్రీస్తు శకం మాదిరిగా ఎన్టీఆర్ శకం ప్రారంభమవుతుంది. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయన వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సి ఉంది” అని చంద్రబాబు అన్నారు..
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


