న్యాయస్థానాల తీర్పులు నిజ స్ఫూర్తితో అమలు పర్చాలి.

 

 

న్యాయస్థానాల తీర్పులు నిజ స్ఫూర్తితో అమలు పర్చాలి.

న్యాయస్థానాల తీర్పులు అమలు కావట్లేదని, ఈ విషయంలో కేంద్రం,కోర్టులు చొరవ తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వ్యక్తం చేసిన ఆవేదననైనా కనీసం కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలని ఉద్యోగుల, ఆఫీసర్ల, పెన్షనర్ల జాతీయ నేత వి.కృష్ణ మోహన్ ప్రధాన మంత్రికి వ్రాసిన లేఖలో కోరారు.

జార్ఖండ్‌ కొత్త హైకోర్టు భవనాన్ని ప్రారంభిస్తూ రాష్ట్రపతి మాట్లాడుతూ “అనుకూలంగా తీర్పు వచ్చినా కొన్ని సందర్భాల్లో ఆ సంతోషం ప్రజల్లో ఎక్కువ సేపు ఉండటం లేదు. ఇందుకు కారణం కోర్టు ఉత్తర్వులు అమలు కాకపోవడమేనని” చెప్పారని అన్నారు.

“సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, కేంద్ర న్యాయశాఖ మంత్రి మేఘ్వాల్‌, సీనియర్‌ జడ్జీలు మొదలైన వారందరికీ నా విన్నపం ఒకటే. నిజమైన అర్థంలో న్యాయం ప్రజల దగ్గరకు వెళ్లేలా చూడండి” అని సూచించారని ఆయన గుర్తు చేశారు. సీజేఐ తన ప్రసంగాన్ని హిందీలో చేయడాన్ని అభినందించిన రాష్ట్రపతి న్యాయస్థానాల భాష అందరినీ కలుపుకొని వెళ్లేలా ఉండాలని అన్నారని ఆయన తెలిపారు.”అందుబాటులో ఉండటం అనేదానికి చాలా కోణాలు ఉంటాయి. అందులో ఖర్చు ఒకటి. కోర్టు దావాల్లో ఇది చాలా ఎక్కువగా ఉంటోంది. దీంతో చాలా మంది పౌరులకు న్యాయం చేరడం లేదు. దీనిపై అందరూ ఆలోచించాలి.కొత్త మార్గాలు అన్వేషించాలి. న్యాయస్థానాల భాష కూడా అందరినీ కలుపుకొనే వెళ్లేలా ఉండాలి” అని రాష్ట్రపతి పేర్కొన్నారని వి.కృష్ణ మోహన్ తెలిపారు.

కొత్త పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవం రాష్ట్రపతి చేతులు మీదుగా జరిగి వుంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి దేశపు ప్రథమ పౌరురాలు. పార్లమెంట్‌కు అధిపతి. దేశానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన నిర్ణయాలను భారత రాష్ట్రపతి పేరు మీద తీసుకుంటారు అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతి, ఉభయ సభలు రాజ్యసభ, లోక్‌సభలతో కూడిన పార్లమెంట్‌కు దేశంలో అత్యున్నత శాసనాధికారం ఉందని, పార్లమెంట్‌ నిర్వహణకు కాల్‌, ప్రోరోగ్‌ చేయడానికి, లోక్‌సభను రద్దు చేయడానికి రాష్ట్రపతికి అధికారం ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 79ని ఉటంకిస్తూ, రాష్ట్రపతి పార్లమెంట్‌లో అంతర్భాగమని, అందువల్ల ప్రారంభోత్సవానికి దూరంగా ఉంచకుండా వుండి వుంటే ప్రధాని ప్రతిష్ట పెరిగేదని తెలిపారు.

ప్రధానమంత్రి నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తారు. ప్రధాని సలహాతో ఇతర మంత్రులను రాష్ట్రపతి నియమిస్తారు. గవర్నర్లు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, కాగ్‌, యుపిఎస్సీ చైర్మన్‌, సిఈసి, ఫైనాన్షియల్‌ కమిషనర్‌, ఇతర ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు. అలాంటి రాష్ట్రపతిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించకుండా లోక్‌సభ సెక్రెటేరియట్‌ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అక్రమం, ఏకపక్షం, అధికార దుర్వినియోగం, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని వి.కృష్ణ మోహన్ పేర్కొన్నారు. రాజదండం (సెంగోల్) వంటి రాజరిక ఫ్యూడల్ వ్యవస్థ ఆనవాళ్లకు బదులు ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతిరూపమైన రాజ్యాంగం, జాతీయ పతాకం వంటి నమూనాలను పార్లమెంటు భవన సముదాయం ప్రారంభోత్సవంలో ప్రతిష్ఠించి వుంటే బాగుండేదని అన్నారు. ప్రతిపక్షాలు కూడా పార్లమెంటరీ సాంప్రదాయాలను ప్రభుత్వ విచక్షణకు వదిలేసి ప్రజల సమస్యలపై కేంద్రీకరిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

వి. కృష్ణ మోహన్ నేషనల్ వైస్ చైర్మన్,

కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీ.సీ.జీ.జీ.ఓ.ఓ)

9440668281 కార్యదర్శి, ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసీయేషన్‌

kmdrdo@gmail.com, V. Krishna Mohan

National Vice Chairman,

Confederation of Central Government Gazetted Officers Organisations

(CCGGOO) kmdrdo@gmail.com 9440668281

Secretary, All Pensioners & Retired Persons Association

Akhand Bhoomi News

error: Content is protected !!