నాతవరం మండలం గునుపూడి లో దళితవాడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణంను అక్కడి నుంచి తక్షణమే తొలగించాలని జిల్లా కో ఆర్డినేటర్ సి హెచ్ గోవింద్ డిమాండ్ చేశారు తెలంగాణ లో మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి 125 అడుగుల విగ్రహం నిర్మిస్తే ఆంధ్ర ప్రదేశ్ లో అంబేడ్కర్ మహాశయుని విగ్రహాల వద్ద ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టి యావత్తు జాతిని అవమానిస్తున్నారని ఎద్దేవా చేసారు అంతే కాకుండా మద్యం దుకాణాలు దళితవాడలలో ఉండటం వలన దళిత యువత విద్యార్థులు మద్యం బారిన పడి పాడైపోయే ప్రమాదం ఉందన్నారు అంతే కాకుండా వాడల్లో ని ప్రజలు కష్టపడి కుటుంబ అవసరాల కోసం సంపాదించిన డబ్బును కాస్తా పాడు చేసుకుని మద్యానికి బానిసలై పోతారారని దేనివల్ల దళిత కుటుంబాలు ఆర్థికంగా చిన్నా బిన్నమై నాశనమై పోయే ప్రమాదం ఉందన్నారు చదువుకునే యువతను దృష్టిలో పెట్టుకుని వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి డా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పరిసర ప్రాంతాలలో నుంచి మరియు దళిత వాడ నుంచి మద్యం దుకాణం ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో మాల మహానాడు దళిత సంఘాల ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన అన్నారు దళిత యువతను విద్యార్థులను దళిత కుటుంబాలను మద్యానికి బానిసలు గా మారకుండా కాపాడుకునే క్రమంలో అన్ని దళిత సంఘాలు మద్దతునివ్వాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎలుగొండికృష్ణ ఎద్దుచిన్న నొక్కిరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు


