ఫిర్యాదుదారుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు సంబంధిత అధికారులు సమస్యలపై పర్యవేక్షణ చేయాలి.

 

ఫిర్యాదుదారుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు సంబంధిత అధికారులు సమస్యలపై పర్యవేక్షణ చేయాలి.

– జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి

భీమవరం: మే 29(, అఖండ భూమి )

స్పందన ఫిర్యాదుదారునికి ఇచ్చిన ఉత్తర్వులు అమలు అయ్యేవరకు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశమందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుండి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి, డిఆర్ఓ కె.కృష్ణవేణి, డిప్యూటీ ట్రైన్ కలెక్టర్ కుమారి డి.అఖిల, డి ఎల్ డి ఓ కే సి హెచ్ అప్పారావు, డిపిఓ జీవీకే మల్లికార్జునరావు ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత అధికారులతో సమస్య పరిష్కార నిమిత్తం మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారునికి సమస్య పరిష్కారానికి ఉత్తర్వులు ఇచ్చి సరిపెట్టకుండా, సమస్య పరిష్కారం అయ్యేవరకు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సమస్య పూర్తి పరిష్కారం కాక మళ్ళీ మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఫిర్యాదుదారులకు ఎట్టి పరిస్థితుల్లో రాకూడదన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా పూర్తి పరిష్కారాన్ని చూపాలని కోరారు. ఈరోజు నిర్వహించిన స్పందనలో భూ తగాదాలు, కుటుంబ సమస్యలు, పారిశుద్ధ్యం, పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరు తదితర అంశాలపై అర్జీలను సమర్పించడం జరిగింది. నేడు నిర్వహించిన స్పందన కార్యక్రమంద్వారా 156 అర్జీలను స్వీకరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!