మహాత్మా గాంధీ శాంతి సందేశాలపై పిల్లలకు బోధన

 

 

మహాత్మా గాంధీ శాంతి సందేశాలపై పిల్లలకు బోధన

భీమవరం మే 29 అఖండ భూమి

దేశాల మధ్య శాంతి సౌభ్రాతృత్వాలతో ప్రపంచ శాంతి అని,మహాత్మా గాంధీ అహింసా శాంతి ఆయుధాలతో ఉద్యమం సాగించి స్వాతంత్ర్యం సాధించారని ,శాంతి మనిషిలో మన శాంతి, మనో వికాసం,క్రమశిక్షణ పెంపొందిస్తుంది అని,కోపం,క్రోధం,కక్షలతో సాధించేది ఏమీ లేదు అని,అరాచకాలతో సమాజ అభివృద్ధి కుంటుపడుతుంది అని , బాల్యం నుండి శాంతి గా ఉండడమే జీవిత లక్ష్యం గా మెలగాలని సంఘ సేవకులు చెరుకు వాడ రంగశాయి అన్నారు. భీమవరం డాక్టర్ వైయస్సార్ .ప్రధమ శ్రేణి శాఖా గ్రంథాలయం భీమవరం నందు వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా వారం అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవం పురస్కరించుకుని బాలలకు శాంతి, అహింస ల పై అవగాహన,శాంతి ప్రార్థనలు నిర్వహించారు.గ్రంధాలయ అధికారి ఈ వేసవి విజ్ఞాన శిబిరాలు జూన్ 11 వరకు జరుగుతాయి అని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అనంతరం విద్యార్థులచే పుస్తక పఠనం, పుస్తక సమీక్ష, నీతి కథలు చెప్పడం, డ్రాయింగ్,పేపర్ క్రాఫ్ట్,డాన్స్ లో శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చదువు వరుల సంఘం అధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యం , విశ్రాంతి ఉపాధ్యాయులు డి . రామ నాగేశ్వరరావు ,డి . భవాని సితల్ ,ఝాన్సి,జె . శ్యామల గారు,డి . శ్యామ్ గారు,విద్యార్థులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!