అమెరికాలో స్థిరపడిన భీమవరం ఎస్ ఆర్ కె ఆర్ విద్యార్థులు అపూర్వ కలయిక

 

 

అమెరికాలో స్థిరపడిన భీమవరం ఎస్ ఆర్ కె ఆర్ విద్యార్థులు అపూర్వ కలయిక

భీమవరం మే 29 : అఖండ భూమి వెబ్ న్యూస్ :

ఎస్ ఆర్ కే ఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు ప్లేస్మెంట్స్ లోనూ ,స్టార్టర్ లోను ఇంటెన్షిప్ అందించడంలోనూ తమ వంతు సహకారం అందిస్తామని అమెరికాలోని న్యూ జెర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాల అల్యూమిని అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా( సానా) సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు తమకు హామీ ఇచ్చారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం జగపతి రాజు చెప్పారు. ఈనెల 27వ తేదీన న్యూ జెర్సీలో అమెరికాలోని కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా, డి సి, అట్లాంట, బోస్టన్ ప్రాంతాల్లో ఉన్న ఎస్ ఆర్ కే ఆర్ పూర్వ విద్యార్థులందరూ పెద్ద ఎత్తున న్యూ జెర్సీలో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో తమకు విద్యను అందించిన కళాశాల ప్రగతికి అల్యూమిని పేరు శాశ్వతంగా గుర్తుండి పోయే విధంగా ఒక నిర్మాణం చేయడంతో పాటు విద్యార్థులకు తమ వంతు సహకారం అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇదే సందర్భంలో పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా తమ సహచరులైన అల్యూమిని విద్యార్థులు వేలాది మంది ఉండటం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కస్పాండెంట్ ఎస్ఆర్కె నిశాంత్ వర్మ అల్యూమిని విద్యార్థుల నిర్దేశించి మాట్లాడుతూ 43 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గలిగిన కళాశాల భారతదేశంలోని ప్రముఖ విద్యాసంస్థగా ప్రగతి సాధించిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏఐసిటిఈ ఐడియా _ ల్యాబ్ అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ వంటివి మంజూరు చేసిందని వివరించారు. మూడు బ్రాంచ్లతో ప్రారంభించిన కళాశాల నేడు 12 శాఖలుగా విస్తరించి వేలాది మందిని ఇంజనీర్లుగా తీర్చిదిద్దుతుందని చెప్పారు. ఈ సందర్భంగా అల్యూమినియం ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం జగపతి రాజు సెక్రటరీ అండ్ కస్పాండెంట్ ఎస్ఆర్కె నిశాంత్ వర్మ, పూర్వపు ప్రిన్సిపల్ డాక్టర్ డి రంగరాజు, కళాశాల గౌర్నింగ్ బాడీ మెంబర్ సాగి సత్య ప్రతిక వర్మ పూర్వపు సిఎస్సి హెడ్ డాక్టర్ జివి పద్మరాజు, రిటైర్డ్ మెకానికల్ ప్రొఫెసర్ డిఎస్ఎన్ రాజు ,బాలకృష్ణ వర్మ తదితరులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అమెరికాలోని ఎస్ ఆర్ కె అల్యూమిని అసోసియేషన్ చెందిన ధూళిపాళ్ల భాను ప్రకాష్, పి. శ్రీనివాసరాజు, వేణు మైనేని, బివి రమణ, చేకూరి సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఫోటో రైట్ అప్: అమెరికాలోని న్యూ జెర్సీలో జరిగిన ఎస్ ఆర్ కె ఆర్ పుర విద్యార్థులు సమ్మేళనంలో పాల్గొన్న విద్యార్థులు ఎస్ ఆర్ కార్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ మేనేజ్మెంట్

Akhand Bhoomi News

error: Content is protected !!