ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ స్టార్ట్…?

 

-ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ స్టార్ట్…?

-ప్రధాన కార్యదర్శులకు సిఈ సి కీలక ఆదేశాలు..?

ఈ సంవత్సరం చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది.ఇందులో భాగంగా ఐదు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ తెలంగాణ సీఎస్‌కు ఎన్నికలకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుత పోస్టులో మూడేళ్లు సర్వీస్ దాటిన ప్రభుత్వ అధికారులను బదిలీ చేయాలని….కీలక స్థానాల్లో ఉన్న రెవెన్యూ, పోలీసు అధికారులను బదిలీ చేయాలని సీఈసీ ఆదేశించింది. అంతేకాకుండా ఈ బదిలీల ప్రక్రియను జూలై 31లోపు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కోరింది. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న అధికారులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశాల్లో పేర్కొంది. ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లకు సొంత జిల్లాలో పోస్టింగ్ ఇవ్వొద్దని సూచించింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు స్థానికంగా పోటీ చేస్తోన్న అభ్యర్థులతో బంధుత్వాలు లేవని వారి నుండి డిక్లరేషన్ తీసుకోవాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది.ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలు ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం..

ఎన్నికల అధికారుల పోస్టింగ్ లపై ఆయా రాష్ట్రాల CS, CEO లకు మార్గదర్శకాలు జారీచేసిన భారత ఎన్నికల కమీషన్..

మిజోరాం 17.12.23

చత్తీస్గఢ్ 03.01.24

మధ్యప్రదేశ్ 06.01.24

రాజస్థాన్ 14.01.24

తెలంగాణ 16.01.24

తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రకటించారు..

Akhand Bhoomi News

error: Content is protected !!