నా హృదయం ముక్కలైంది.. రైలు ప్రమాదంపై బైడెన్‌ దిగ్భ్రాంతి..

 

Odisha Train Accident: నా హృదయం ముక్కలైంది.. రైలు ప్రమాదంపై బైడెన్‌ దిగ్భ్రాంతి..

వాషింగ్టన్‌ అఖండ భూమి వెబ్ న్యూస్ :

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం (Odisha Train Accident)పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు..

ఈ హృదయ విదారక వార్త వినగానే తన మనసు చలించిపోయిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.

”భారత్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించిన విషాద వార్త విని నా హృదయం ముక్కలైంది. జిల్‌ బైడెన్‌ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ భయానక ఘటన వల్ల ప్రియమైన వారిని కోల్పోయిన వారి కుటుంబాలు, గాయపడిన వారి గురించి ప్రార్థిస్తున్నాం. భారత్‌, అమెరికాను ఇరు దేశాల కుటుంబ, సాంస్కృతిక విలువల్లో ఉన్న మూలాలే ఏకం చేస్తున్నాయి. బాధితుల కోసం యావత్తు అమెరికా సంతాపం వ్యక్తం చేస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్న తరుణంలో మా ఆలోచనలన్నీ బాధితుల కుటుంబాలపైనే ఉన్నాయి” అని బైడెన్‌ అన్నారు..

Akhand Bhoomi News

error: Content is protected !!