CM KCR: వారందరికీ గుడ్‌న్యూస్.. పెన్షన్ 4వేలకు పెంపు..
మంచిర్యాల : సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా కొత్త కలెక్టరేట్, బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు..
అనంతరం, సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని వికలాంగులకు శుభవార్త వినిపించారు. తెలంగాణలోని వికలాంగులకు ఆసరా పెన్షన్లు పెంచుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. పెంచిన పెన్షన్లు వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.
కాగా, మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. మొత్తం తెలంగాణ సమాజం బాగుండాలి. తెలంగాణ వచ్చి పదేళ్లు అయ్యింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో వికలాంగుల పెన్షన్ కూడా పెంచబోతున్నాం. ఆసరా పెన్షన్లతో అందరూ బాగున్నారు. వికలాంగులకు ప్రస్తుతం రూ. 3,116 పెన్షన్ ఇస్తున్నాం. వారికి మరో వెయ్యి రూపాయాలు పెంచుతున్నాం. మంచిర్యాల గడ్డ నుంచి తెలంగాణ ఈశాన్య ప్రాంతం నుంచి ప్రకటించాలని నేను సస్పెన్షన్‌లో పెట్టాను. వచ్చే నెల నుంచి రూ. 4,116 పెన్షన్ అందుతుంది. అందరి సంక్షేమాన్ని, మంచిని చూసుకుంటున్నాం అని కేసీఆర్ తెలిపారు..
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…