యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ ఆధ్వర్యంలో
ఓఎన్జిసి సంస్థ ద్వారా నిర్వహించబడిన
4వ విడత ఉచిత హెల్త్ మరియు ఐ క్యాంప్ లకు విశేష స్పందన
యానం అఖండ భూమి వెబ్ న్యూస్:
యానాం మహాత్మ గాంధీ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో చిల్డ్రన్ ఆడిటోరయం నందు స్థానిక ఓఎన్జిసి సంస్థ ద్వారా యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన నాల్గవ విడత మెగా హెల్త్ క్యాంపు ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ ప్రాంతీయ పరిపాలనా అధికారి మునిస్వామి,సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముగం, విద్యుత్ శాఖ ఏ.ఇ లంక కృష్ణా రావు,హాస్పిటల్ ఏ.డి పలాష్ కుమార్ పాన్యల్, ఓఎన్జిసి ఎగ్జిక్యూటివ్ అధికారి సదా అన్వర్, ప్రజాపనులు శాఖ ఇ.ఇ వీరసెల్వం,ఏ.ఇ లు
జె.ఇ లు తదితరులు పాల్గొన్నారు.
ఈ మెగా హెల్త్-క్యాంపు కి సుమారు 535 మందికి పైగా హెల్త్-చెకప్ మరియు కంటి పరీక్ష చేసుకోవడం జరిగిందని అందులో సుమారు 55 మంది కి కంటి ఆపరేషన్ నిమిత్తం రాజమహేంద్రవరం పరమహంస యోగానంద నేత్రాలయ పౌండేషన్ కి పంపించడం జరిగిందని,246 మందికి పైగా కళ్ళ జోడ్లు పంపిణీ చేయడం జరిగిందని యానంలో ఇలాంటి ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించడం ద్వారా ఎంతో మంది పేద-ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని స్థానికులు, ఆయా ప్రాంత-ప్రజలు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ ని అభినందించారు. ఇలాంటి ఉచిత హెల్త్ క్యాంప్ లను స్థానికులు మరియు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అందరు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ తెలిపారు . ఇలాంటి హెల్త్ క్యాంపులు మరిన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ తెలిపారు.లయన్స్ క్లబ్ పిల్లారాయ అధ్యక్షతనలో ఈ మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని,
మా సంస్థ నుండి ఇలాంటి మరిన్ని సేవ కార్యక్రమాలు చేయాలని ఆసంస్థ అధ్యక్షుడు పులవర్తి శ్రీను తెలిపారు.ఈ కార్యక్రమంలో పండు సిద్దార్థ్ కుమార్,యస్సార్ యం టి.మూర్తి , కాకి నాగేశ్వర రావు,నాయకులు, మహిళ నాయకులు,గొల్లపల్లి అభిమానులు,మరియు యూత్ లీడర్స్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…