50 కొత్త మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోదం .. తెలంగాణలో 12
తెలంగాణ అఖండ భూమి వెబ్ న్యూస్ :
దేశంలో కొత్తగా 50 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 5, తెలంగాణకు 12 కొత్త కాలేజీల ఏర్పాటుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఒక్కో కాలేజీలో 2023,24 విద్యా సంవత్సరం నుంచి 150 సీట్లతో
క్లాసులు ప్రారంభం అవుతాయని కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
తెలంగాణ అఖండ భూమి వెబ్ న్యూస్ :
తెలంగాణలోని మేడ్చల్, వరంగల్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, అసిఫాబాద్, నిర్మల్, సిరిసిల్ల, వికారాబాద్, జనగాం, హైదరాబాద్‌లలో కొత్త కళాశాలల ఏర్పాటుకు కేంద్రం ఆమోదించింది. మేడ్చల్-మల్కాజిగిరిలో అరుంధతి ట్రస్ట్, మేడ్చల్‌లో సీఎంఆర్ ట్రస్ట్, వరంగల్‌లో కొలంబో ట్రస్ట్‌ల ఆధ్వర్యంలో వైద్యకళాశాలలు ఏర్పాటు కానున్నాయి. మిగిలిన అన్ని కాలేజీలను ప్రభుత్వమే ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది.*
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


