గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు గాం గంటం దొర 99 వ వర్ధంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం సంతోషకరం బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు కురుసా ఉమామహేశ్వరరావు
అల్లూరి జిల్లా పాడేరు/ గూడెం కొత్త వీధి అఖండ భూమి వెబ్ న్యూస్ :
అల్లూరి సీతారామరాజు జిల్లా కొత్త పాడేరు గ్రామంలో బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా కార్యాలయంలో గిరిజన మోర్చా ఉత్తరాంద్ర జోనల్ ఇంచార్జ్ కురుసా రాజారావు ఆధ్వర్యంలో గిరిజన మోర్చా రాష్ట్ర, జిల్లా నాయకులు సమక్షంలో కీ”శే” గాం గంటం దొర చిత్ర పటానికి పూలతో నివాళులు అర్పించాడాం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యాతిధిగా బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు పాల్గొని కార్యక్రమం ఉధ్యేశించి మాట్లాడుతూ గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు గాం గంటం దొర 99 వ వర్ధంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం చేపట్టడం మంచి శుషితం.”విప్లవజ్యోతి” అల్లూరీ సీతారామరాజు భారతదేశ స్వాతంత్ర్య సముపార్ధన కోసం బ్రిటిష్ సామ్రాజ్యా పై సాగించిన పోరాటంలో సేవధిపతులుగా గాం గంటం దొర ఆయన సోదరుడు గాం మల్లు దొర వ్యవహరించారు. వీరితోపాటు సుమారు 300 మంది గిరిజన యోధులు ఈ మన్యం పితురిగా ప్రసిద్ధి చెందిన సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. గాం గంటం దొర 7 జాన్ 1924 లో వలసం పేట గ్రామంలో బ్రిటిష్ సేనల తుపాకీ కాల్పుల్లో మరణించారు.చింతపల్లి, కృష్ణదేవిపేట,రాజహోంమంగి, అడ్డతీగల, రంపచోడవరం, అన్నవరం,మల్కాన్ గిరి పోలీస్ స్టేషన్ లపై గాం గంటం దొర కీలకపాత్ర పోషించాదాని చెప్పడం జరిగింది. అందరుకుడా ఆయనికి ఆశయ సాధనకై మనలో దేశ భక్తి నింపుకొని దేశ పని చేయాలని కోరాడాంమైనది.ఈ కార్యక్రమంలో బీజేపీ గిరిజన మోర్చా ఉత్తరాంద్ర జోనల్ ఇంచార్జ్ కురుసా రాజారావు ,జిల్లా ప్రధాన కార్యదర్శి సల్లా రామకృష్ణా,రాష్ట్ర గిరిజన మోర్చా కార్యవర్గ సభ్యులు కాకరి చిన్నయ్య,పాడేరు మండల ఉపాధ్యక్షులు,జీ మాడుగుల మండల ప్రధాన కార్యదర్శి నూకరాజు,బూత్ సభ్యులు రవి,గణేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…