నిబంధనలు అతిక్రమిస్తే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలపై చర్యలు తప్పవు… సీఐ యుగంధర్

 

నిబంధనలు అతిక్రమిస్తే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలపై చర్యలు తప్పవు… సీఐ యుగంధర్

వెల్దుర్తి జూన్ 10 (అఖండ భూమి) : ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా ప్రైవేటు స్కూల్ యాజమానులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని వెల్దుర్తి సీఐ యుగంధర్ అన్నారు. శనివారం స్థానిక సీఐ కార్యాలయం నందు ప్రైవేట్ స్కూల్ యాజమాన్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ అనుగుణంగా ప్రతి నెలకొక్కసారి ప్రిన్సిపాల్ కంప్లయింట్ బుక్ ను తనిఖీ చేయాలి. ప్రతి వాహనం (బస్సు) లో ఒక అత్యవసర ద్వారము కల్పించాలి. దానిపై స్పష్టంగా కనిపించేలా “అత్యవసర

ద్వారము” అని వ్రాయించాలి. ప్రతి వాహనంలోనూ అవసరమైన మందులు మరియు పరికరాలతో కూడిన ప్రధమచికిత్స పెట్టె ను అందుబాటులో ఉండాలి. వారానికొకసారి ప్రిన్సిపాల్ లేదా సంబంధిత అధికారి ఈ ఫస్ట్ ఎయిడ్ బాక్సును తనిఖీ చేయాలి. నెలకొకసారి పేరెంట్స్ కమిటీ ఈ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ను తనిఖీ చేయాలి. ఇందునిమిత్తమే ఒక ప్రత్యేక రిజిస్టరు నిర్వహిండాలి.

యాజమాన్యం బస్సుల పార్కింగౌకొరకు పాఠశాల కళాశాల ఆవరణలోనే స్థలమును కేటాయించవలసి ఉంటుందన్నారు.

విద్యార్థుల సురక్ష నిమిత్తం వారు పాఠశాల, కళాశాల ఆవరణలోనే బస్సునుండి దిగడం కాని ఎక్కరం కాని చేయునట్లు వారిని ప్రేరే పించాలి. ప్రతి విద్యాసంస్థ బస్సు కనీసం ఒక అటెండర్లు కలిగి ఉండాలి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ బస్సు అటెండర్ను వాహనం నడపడానికి అనునుతించకూడదు.

ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పేర్కొన్న విధంగా విద్యాసంస్థ బస్సు డ్రైవర్ మరియు అటెండర్వా రికివ్వబడిన యూనిఫారము ను విధిగా ధరించాలి. సదరు బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థుల పట్టిక ఆ బసప్పులో తప్పకుండా వుండాలి. విద్యార్థుల పేర్లు, తరగతులు, ఇళ్ళ చిరునామాలు మరియు వారు దిగవలసిన స్థలం యొక్క వివరాలు ఆ లిస్టులో ఉండాలి.విద్యార్థి పేరుకు ఎదురుగా అతను, ఆమె దిగవలసిన ఎక్కువలసిన స్థలం పేరు సూచించాలి. బస్సు బయలుదేరు స్థలం, మధ్యలో ఆగే స్థలాలు, బస్సు రూటు తెలియజేస్తూ ఫిన్నిపాల్ చే జతపరచబడిన రూట్ లిస్టుతో జతపరచబడి ఉండాలి. విద్యాసంస్థ బస్సు డ్రైవర్, బస్సులో విద్యార్థులు ఎక్కడం, దిగడం సరిగ్గా, స్పష్టంగా గమనించేందుకు కన్నెక్స్

క్రాస్ వ్యూ అర్ధాలు అమర్చబడాలి. బస్సులో ఒక పెద్ద పారదర్శక అద్దం (మిర్రర్) కూడా అమర్చాలి, తద్వారా వాహనం నడిపే డ్రైవర్కు బస్సు లోపలి భాగం స్పష్టంగా కనబడేలా ఉంటుంది.

బస్సు ఇంజన్ కంపార్ట్మెంట్లో ఒక అగ్నిమాపక యంత్రం, పొడి అందుబాటులో ఉండాలి. బస్సులో సీట్ల కింద బ్యాగులు ఉంచుకొ నేందుకు అరల ఏర్పాటు ఉండాలి.

బస్సులో తగు దూరంలో అక్కడక్కడ నిలువు స్తంభాలు, కప్పును, బస్సు నేలభాగాన్ని కలుపుతూ ఏర్పాటు చేయాలనీ సూచనలు ఇచ్చారు. ఈ సమావేశం నందు ప్రైవేట్ స్కూల్ యాజమానులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!