మే 9 నుండి జగనన్నకు చెబుదాం…

మే 9 నుండి జగనన్నకు చెబుదాం.

 

పార్వతీపురం, ఏప్రిల్ 28 (అఖండ భూమి ) : జగనన్నకు చెబుదాం కార్యక్రమం మే 9వ తేదీ నుండి ప్రారంభించడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్లతో రాష్ట్ర ముఖ్య మంత్రి శుక్ర వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అత్యంత నాణ్యతతో సమస్యల పరిష్కారం కావాలన్నారు. ముఖ్య మంత్రి కార్యాలయం నుండి ఈ కార్యక్రమం పర్యవేక్షణ జరుగుతుందని ఆయన అన్నారు. కాల్ సెంటర్ కు 1902 టోల్ ఫ్రీ ఫోన్ నంబరు పెట్టడం జరిగిందన్నారు. ప్రతి శని వారం గృహ నిర్మాణ దినోత్సవంగా నిర్వహించాలని అన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. జగనన్న భూరక్షా, భూ హక్కు, నాడు నేడు, జగనన్న విద్యా కానుక, తదితర అంశాలపై ముఖ్య మంత్రి సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ , పోలీస్ సూపరింటెండెంట్ విక్రాంత్ పాటిల్, ఇన్ ఛార్జ్ జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, జిల్లా గ్రామ పంచాయితీ అధికారి బలివాడ సత్యనారాయణ, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.రఘురాం, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ అధికారి ఓ. ప్రభాకర రావు, ఇన్ ఛార్జ్ జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర రావు,

Akhand Bhoomi News

error: Content is protected !!