సంక్షేమంలో తెలంగాణ నెంబర్ వన్…

 

సంక్షేమంలో తెలంగాణ నెంబర్ వన్

దేశం చూపు తెలంగాణ వైపు

భద్రాద్రి కొత్తగూడెం (జూన్ 10 అఖండ భూమి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అధ్యక్షతన జరిగిన సుపరిపాలన దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.తొలిత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు వారికి ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు మాట్లాడుతూ పరిపాలన వ్యవస్థ ప్రజలకు చేరువ ఉండాలని సీఎం కేసీఆర్ కాంక్షించారని అన్నారు.పరిపాలన సౌలభ్యం కోసం పది జిల్లాలు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన రెండేళ్లలోనే పరిపాలన సంస్కరణలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని, ప్రభుత్వ సంస్థలను ప్రజలకు చేరువ చేయడానికి కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపాయన్నారు. కొత్త జిల్లాలు మండలాలు ఏర్పాటు చేసుకోవడం నూతన గ్రామపంచాయతీలను గుర్తించడం లాంటివి పరిపాలన సౌలభ్యం కోసమే అని పేర్కొన్నారు.

దళిత బంధు రైతుబంధు, రైతు బీమా,బీసీ కుల వృత్తుల వారికి రుణాలు ఇలా దేశం గర్వించేలా ఎన్నో గొప్ప గొప్ప పథకాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వినీత్,జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు,జిల్లా ఫారెస్ట్ అధికారి రంజిత్ నాయక్, కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగల రాజేందర్, ప్రభుత్వ అధికారులు, జిల్లాలోని ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!