నిరుపేద ముస్లిం ఆడపిల్ల పెళ్ళికి
బీరువాను అందించిన స్ఫూర్తి సేవా సమితి…
సాయమందించిన మనసున్న అజ్ఞాత దాత…
నంద్యాల జిల్లా, డోన్ పట్టణంలో గల కొండపేట ప్రాంతానికి చెందిన జాఫర్, హుసేన్ బీ అనే నిరుపేద దంపతులు తమ కుమార్తె వివాహం సందర్బంగా ఒక బీరువా కావాలని స్ఫూర్తి సేవా సమితి వారిని సాయం కోరగా స్పందించిన స్ఫూర్తి సభ్యులు డోన్ కి చెందిన ఓ అజ్ఞాత దాత సహకారంతో జాఫర్, హుసేన్ బీ దంపతులకు ఆదివారం నాడు పదివేల రూపాయల విలువ గల బీరువాను అందించడం జరిగింది. నిరుపేదలకు సాయం చేయడంలో ఆత్మసంతృప్తి ఉంటుందని స్ఫూర్తి టీమ్ పేర్కొన్నారు. అడిగిన వెంటనే పేద ముస్లిం ఆడపిల్ల పెళ్ళికి బీరువాను అందించిన అజ్ఞాత దాతకు, స్ఫూర్తి సభ్యులకు జాఫర్, హుసేన్ బీలు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు స్ఫూర్తి మధు, హుమయున్, బ్రహ్మనందరెడ్డి, ఆంధ్రజ్యోతి బాష, బహదూర్, మౌలాలి, సీసంగుంతల శివ తదితరులు పాల్గొన్నారు.*
*స్ఫూర్తి సేవా సమితి. డోన్*
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి కలెక్టర్…
బి సిల ఆణిముత్యం రత్నప్ప కుంభార్ సేవలు యువతకు స్ఫూర్తి
మా విద్యార్థులు ఎక్కువ మంది హిందీ నేర్చుకోవాలని మేం కోరుకుంటున్నాం: రష్యా మంత్రి…
దోమకొండ ఊరడమ్మ వీధిలో శానిటేషన్ కార్యక్రమం