ముమ్మిడివరం అఖండ భూమి వెబ్ న్యూస్
బహుజన సమాజ్ పార్టీ, ముమ్మిడివరం నియోజకవర్గ సమావేశం బడుగు భీమేశ్వరరావు అధ్యక్షతన బల్లగేటు సెంటర్ నందిని వాటర్ ప్లాంట్ ఆవరణలో జరిగింది. ఈ సమావేశానికి డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉపాధ్యక్షులు వాకపల్లి భీమారావు ముఖ్యఅతిథిగా హాజరైనారు. రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాలకు అనుగుణంగా బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈనెల 30వ తారీఖున జరగబోవు క్యాడర్ క్యాంపుకు ముఖ్య అతిథిగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి గారు హాజరుకానున్నారని తెలిపారు. కావున బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసి ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పందిరి శ్రీను,కమిడి శ్రీను, మోకా మధు, జనిపల్లి మహేంద్ర,నందికి క్రాంతి కుమార్,బండి మరిడేష్,కాశి చంటిబాబు, కమిడి బాలాజి తదితరులు పాల్గొన్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



