చింతలపూడి లో “ఉఫాది ” పనులను నిలిపేసిన కూలీలు!
రోజు 60 రూపాయలు మించి ఇవ్వలేమన్న విఆర్ పి, టి ఏ లు?
పరిష్కారం చేసే వరకు పనులకు వెళ్ళేదే లేదన్న కూలీలు.
కొయ్యూరు అఖండ భూమి
జూన్ 13 అల్లూరి జిల్లా
రోజు ఐదు గంటలు పనిచేస్తే 270రూపాయలు కూలీ వస్తుందని చెప్పిన వి ఆర్ పి, టి ఏ లే మూడు నెలలు దాటాక మీరు చేసిన పనులకు రోజు 60 రూపాయలకు మించి పడలేదని చెప్పటంతో ఆ గ్రామ ఉపాధి కూలీలంతా బాయ్ కట్ చేశారు అనంతరం నిరసన చేపట్టారు. ముందు చెప్పిన వాళ్లే తీరా ఇన్నాళ్లు పనిచేసాక ప్రకటించిన కూలీ కంటే తగ్గించి ఇష్టమంటే సహించేది లేదని మండల అధికార్ల కు పిర్యాదు చేస్తామని తెలిపారు. కొయ్యూరు మండలం చింతలపూడిలో ఉఫాది పనుల ప్రారంభం లో స్థానిక వి ఆర్పి, టెక్నీకల్ అసిటెంట్ లు కలిసి మీరంతా బయిట పనులకు మానేసి ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి పనులకే రావాలని, ప్రభుత్వం ఒక్కొక్కరికి రోజు వారి కూలిగా 270 రూపాయలు ఇస్తుందని చెప్పగా తమంతా రోజు ఐదు గంటల పనులకే 250 రూపాయలు వచ్చే బయిట ప్రవేట్ కు వెళ్లే పనులను మానేసి 270రూపాయలు వస్తుందనే ఆశతో ఉఫాది పనులకు వెళుతున్నట్టు చింతలపూడి కూలీలు తెలిపారు. తొలి రెండు వారాలు 270రూపాయలు పడే వాటికి అదనంగా కూడా పేమెంట్ వచ్చేదాని ఇదే బాగుందని ఆశించిన తమకు నెల రోజులుగా చేసిన ఉపాధి పనులకు కేవలం రోజుకు రూ.60వస్తుందని మీకు ఇష్టం ఉంటే ప్రభుత్వం కల్పిస్తున్న ఉఫాది పనులకు రావచ్చు అని లేదంటే మానుకోవాలంటూ విఆర్ఓ, టెక్నీకల్ అసిటెంట్ చెబుతున్నారని ఇదెక్కడి న్యాయం అంటూ ఆయా కూలీలంతా చింతలపూడి లో మంగళవారం భూములు సదును చేసే పనులను నిలిపేశారు. కాగా కొన్ని నెలలుగా పంచాయతీ లో ఉఫాది పనులు చేపడుతున్న సంభంధిత విఆర్పి, టి ఏ లు (అమావాస్య, పున్నం కు ) నెలలో రెండు దపలే సందర్శించి తూ తూ మంత్రంగా చూసి వెళ్ళిపోతారని కూడా చింతలపూడి పూడి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మండల అధికార్లు, ఉఫాది ఏపిఓ లు తమ సమస్య పరిష్కారం చేయాలని లేని పక్షం లో ఐటీడీఏ, పి ఓ, జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేస్తామని అన్నారు. మండుటెండల్లో గేంజీ, కడుగు లేక కష్టపడిన కూలీ బయిట పనులకంటే తగ్గించి కేవలం రోజు 60రూపాయలే వస్తాయని తెలపటం పట్ల ఆందోళనచెందే తమంతా ఉఫాది పనులను బాయ్ కట్ చేస్తున్నట్టు విలేకరుల ఎదుట స్వష్టం చేసి ఈ పత్రికా ప్రకటన ఇస్తున్నట్టు తెలిపారు.



