పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు కార్పస్ ఫండ్ చెక్ లను అందజేసిన జిల్లా ఎస్పీ డి.మేరీ ప్రశాంతి

అనారోగ్య కారణాలతో మృతి చెందిన పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు కార్పస్ ఫండ్ చెక్ లను అందజేసిన జిల్లా ఎస్పీ డి.మేరీ ప్రశాంతి

భీమవరం జూన్ 13, అఖండ భూమి

పోలీస్ కుటుంబాలకు అండగా వుంటూ వారి సమస్యల పరిష్కరానికి ఎళ్ల వేళల సిద్ధంగా ఉంటామని ఏలూరు జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి తెలిపారు. మంగళవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అనారోగ్యంతో మృతి చెందిన ఏ అర్ ఎస్ ఐ 1538 అంబటి వేంకటేశ్వర రావు భార్యకు విజయ లక్ష్మి కి కార్పస్ ఫండ్ నుండి 1,00,000 రూ.ల ను చెక్కు ను అందజేశారు.అనారోగ్యంతో మృతి చెందిన ఏ అర్ ఎస్ ఐ 934 ఎల్.నాగేశ్వర రావు భార్యకు ఎల్. రాధ రాణి కి వారి యొక్క కుమార్తె లు కార్పస్ ఫండ్ నుండి 1,00,000 రూ .ల చెక్ ను జిల్లా ఎస్పీ స్వయంగా అందజేసినారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బాధిత పోలీస్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ఉన్న సమస్యలను గురించి, వారి పిల్లల చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు, పోలీసు శాఖలో అంకిత భావంతో విధులు నిర్వర్తించే సిబ్బంది మరణించడం బాధాకరమన్నారు. అటువంటి వారి కుటుంబాలకు పోలీస్ శాఖ అండగా ఉంటుందన్నారు. మనం అందరం పోలీసు కుటుంబమని ఏదైనా సమస్య వచ్చిన, ఏ సహాయం కావాలన్నా తక్షణం స్పందించి సహాయం అందించడానికి ఎల్లవేళల పోలీస్ శాఖ సంసిద్ధంగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుండి రావాల్సిన బెనిఫిట్స్ త్వరితగతిన అందేలా చూస్తామన్నారు. సిబ్బంది నిర్వహించిన విధులు, తీసుకొన్న చొరవ వెలకట్టలేనిదని తెలియచేసినారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎం జె వి భాస్కర్ రావు , ఎస్.బి ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు , పోలీస్ ప్రధాన కార్యాలయం సిబ్బంది మరియు పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు నాగేశ్వర రావు మరియు సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!